Gaddi chamanthi mokka upayogalu

ఈ మొక్క కనిపిస్తే వేర్లను కూడా వదలకండి ఎందుకంటే

ప్రియమైన మిత్రులారా .. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మొక్క ఏదో ఒక విధమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అందుకే మనం ఎన్నో మొక్కలు గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ మొక్కలలో ఉండే ఔషధ గుణాలు తెలుసుకొని వాటిని మన వైద్యంలో ఉపయోగించుకుంటున్నాం. అలాంటి మొక్కలలో ఒకటైన గడ్డి చామంతిమొక్క గురించి ఈరోజు గురించి తెలుసుకుందాం. దీని ఈ మొక్క శాస్త్రీ య నామం ట్రైడాక్స్ ప్రొకంబన్స్.దీనిని ఇంగ్లీషులో మెక్సికన్ డైసీ, కోట్ బట్టన్స్ అని పిలుస్తారు.సంస్కృతంలో జయంతి వేద అంటారు.

ఇది ఎక్కువగా మన ఇంటి ముందు పెరట్లో లేదా పంట పొలాల్లో గట్లమీద చెరువు గట్టు మీద కనిపిస్తూ ఉంటుంది. దీనితో పిల్లలు కూడా ఆడుకొంటూ ఉంటారు. దీని వల్ల మనకు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని మట్టి పలక అని కూడా పిలుస్తారు. కాలికి గాయాలు తగిలి  పుండుగా మారి రక్తం కారుతున్న ఈ గట్టి పలక మొక్క రసాన్ని తీసి రాస్తే చేస్తే గాయాలు నయమవుతాయి. మన రైతులకు ఈ గట్టి పలక మొక్క గురించి బాగా తెలుసు ఎందుకంటే పొలాల్లో విరివిగా కనిపించే ఈ మొక్క వారికి ఒక వైద్యుడిగా పని చేస్తుంది. పొలంలో వారు పని చేసేటప్పుడు ఎక్కడైనా దెబ్బ తగిలితే వెంటనే ఈ ఆకు రసాన్ని దెబ్బ తగిలిన చోట ఈ రసాన్ని పిండి రక్తం గడ్డ కట్టేలా చేసుకునేవారు.

షుగర్ వ్యాధికి ఈ గడ్డి చామంతి మొక్క చాలా బాగా పనిచేస్తుందని ఈ మధ్యనే పరిశోధనలో తేలింది. గడ్డిచామంతి ఆకులలో ఉండే జేర్యలోనిక్ అనే రసాయనం వలన ఇది షుగర్ వ్యాధికి చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో ఈ రసాయనం బాగా ఉపయోగపడుతుంది.

నీటిలో ఉండే ఫ్లోరైడ్ శక్తి వలన ఎన్నో రకాల జబ్బుల బారిన పడుతున్నారు. అలాంటి ఫ్లోరైడ్ను శక్తిని తగ్గించే గుణం ఈ గడ్డి చామంతి ఆకులకు ఉందని ఈమధ్యే పరిశోధనల్లో తేలింది. గడ్డి చామంతి మొక్క ఆకులకి తెల్లని వెంట్రుకలను నల్లగా మార్చే శక్తి ఉంది. ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో నూనెను తయారు చేసుకుని వాడితే మీ వెంట్రుకలు నల్లబడతాయి.

గడ్డి చామంతి ఆకులు గుంటగలగర ఆకులు మరియు నల్ల నువ్వుల నూనెను తీసుకోండి. ఈ రెండు ఆకుల రసాన్ని నువ్వుల నూనెతో కలిపి సన్నని సెగపై మరిగించాలి. నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి ఆ నూనెను తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత తలకు బాగా పట్టించాలి. రాత్రిపూట నూనెను అప్లై చేసిన తర్వాత తెల్లవారుజామున తలస్నానం చేయాలి. ఇలా చేస్తూ వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మీ  జుట్టు నల్లబడుతుంది. ఇలా వాడటం వలన జుట్టు ఒత్తుగా పొడవుగా కూడా మారుతుంది.

దోమలను పారదోలే లక్షణాలు ఈ ఆకులలో ఉన్నాయి. ఎండిన ఆకులను తీసుకువచ్చి ఇంట్లో పొగబెట్టడం ద్వారా దోమలు ఉండకుండా పారిపోతాయి. గడ్డిచామంతి మొక్కను పలకల ఆకు అని పిలుస్తారు. పూర్వం మనకు మట్టి పలకలు ఉండేవి. ఆ మట్టి పలకలపై ఈ ఆకుతో రుద్ది  దానిపైన రాస్తూ ఉండేవారు అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

1 thought on “ఈ మొక్క కనిపిస్తే వేర్లను కూడా వదలకండి ఎందుకంటే”

  1. దీనిని షుగర్ వ్యాది వున్న వాళ్ళు ఎలా వాడాలో తెలియజేయండి

    Reply

Leave a Comment

error: Content is protected !!