చర్మంపై మచ్చలు మొటిమలు తో బాధపడుతుంటే మనం ఇంట్లోనే మినప్పప్పుతో చేసుకునే ఒక చిట్కా అద్భుతంగా పనిచేస్తుందని మీకు తెలుసా. ఏంటి మినప్పప్పు తో కూడా చర్మాన్ని రక్షించుకోవచ్చా అనుకుంటున్నారా? నిజమండీ మన పురాతన కాలం నుండి ఆహారంలో భాగంగా తీసుకునే మినప్పప్పు చర్మ రక్షణలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీనిని ఫేస్ ప్యాక్లోనూ, సున్నిపిండి లోనూ వాడుతూనే ఉంటారు. అలా కాకుండా క్రీమ్ రూపంలో కూడా మనం దీన్ని చర్మ రక్షణ కోసం ఉపయోగించవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ చిట్కా చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గిస్తుంది.
చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడంలో చాలా బాగా పని చేస్తుంది. దీని కోసం మనం ఒక కప్పు మినప్పప్పును రాత్రంతా నానబెట్టుకోవాలి. దీనిని శుభ్రంగా నీళ్లు తెల్లగా వచ్చేంతవరకు కడిగి పెట్టుకోవాలి. దీనిని కొంచెం నీరు వేసుకొని మెత్తని పేస్టులా రుబ్బు కోవాలి. ఇలా రుబ్బుకున్న మినప్పప్పు ఈ పేస్ట్ని ఒక గిన్నెలో కాటన్ క్లాత్ వేసుకొని అందులో వేయాలి. గట్టిగా పిండడం వలన దీని నుండి పాల లాంటి పదార్థం బయటకు వస్తాయి. ఇలా మొత్తం నీటిశాతాన్ని పిండుకున్న తర్వాత ఈ మిగిలిపోయిన మినప్పప్పు వంటల్లో ఉపయోగించుకోవచ్చు.
మనకు కావలసింది మినప్పప్పు పాల లాంటి పదార్థం ఈ పదార్థాన్ని ఒక నాన్స్టిక్ పాన్లో వేసుకొని సిమ్లో దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఈ పేస్ట్ దగ్గరికి అయిన తరువాత స్టవ్ ఆపేసి ఒక గాజు గిన్నెలో నిలువ చేసుకోవచ్చు. ఈ పేస్ట్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంపై ముడతలు మచ్చలు వంటివి తొలగిపోతాయి. క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. దీన్ని ముఖానికి అప్లై చేసిన తర్వాత నెమ్మదిగా మసాజ్ చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
అలాగే చర్మాన్ని పాలిషింగ్ కోసం ఈ క్రమంలో అలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మాన్ని పాలిష్ చేయడంతో పాటు చర్మంలో తేమను కాపాడడం, అందమైన చర్మాన్ని అందించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ముఖంపై ముడతలు, నల్లని మచ్చలు, మృతకణాల్ని తొలగించడం వంటి అనేక ఉపయోగాలు కలిగిస్తుంది. ఈ పేస్ట్ను నెలరోజులు నిలవ ఉంచుకోవచ్చు. కనీసం వారానికి రెండు సార్లు ఉపయోగించడం వలన ఆరోగ్యవంతమైన చర్మం సొంతం చేసుకోవచ్చు.