hair fall stop home remedy

వారంలో 1 సారి … ఊడిన జుట్టు దగ్గర 20 కొత్త వెంట్రుకలు వచ్చి ఒత్తుగా పెరుగుతుంది…ఇది నిజం

జుట్టు సంరక్షణలో మనం తీసుకునే ఆహారం ప్రధానపాత్ర పోషిస్తే తీసుకునే జాగ్రత్తలు కూడా జుట్టు రాలకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.  ఖరీదైన ప్రోడక్ట్స్ వాడడం వలన ప్రయోజనాలు ఎన్నుంటాయో నష్టాలు, దుష్ప్రభవాలు కూడా అన్నే ఉంటాయి. సరైన పోషకాహరం, ఆరోగ్యకరమైన అలవాట్లు జుట్టు సంరక్షణకు సహకరిస్తాయి.

 సహజంగా దొరికే పదార్థాలతో  తీసుకునే జాగ్రత్తలు జుట్టులో సమస్యలు తొలగించి  తక్కువ ధరలో జుట్టును ఆరోగ్యంగా చేస్తాయి. అవేంటో చూద్దాం. ఒక గిన్నెలో గ్లాసున్నర నీళ్ళు పోసి అందులో చెంచా ఉసిరి పొడి వేసుకోవాలి. ఈ నీటిని సన్నని మంటపై ఐదారు నిమిషాలు మరిగించిన తర్వాత మంట ఆపేసి చల్లారాక అందులో అరచెక్క నిమ్మరసం కలపాలి.

 ఇందులో మనం వాడుకునే ఏదైనా షాంపూని మన జుట్టు పరిమాణాన్ని బట్టి తీసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపి తలకు పట్టించి రెండు నిమిషాలు రుద్ది మామూలు తలస్నానం చేయాలి. ఇందులో ఉండే షాంపూ వలన మళ్ళీ తలస్నానం చేసే అవసరం లేదు. జుట్టు పెరుగుదలకు, శుభ్రపరుచుకోవడానికి ఇది సహజమైన పద్ధతి. ఇలా చేయడం వలన తలలో ఉండే చుండ్రు, జిడ్డు తగ్గి జుట్టు శుభ్రంగా ఉంటుంది.

 అలాగే ఉసిరి, నిమ్మరసంలో ఉండే విటమిన్ సి తలలోని చర్మాన్ని ఆరోగ్యవంతం చేస్తుంది. జుట్టును పీచులా కాకుండా మృదువుగా తయారుచేస్తుంది. ఉసిరి జుట్టు కుదుళ్ళలోకి చొచ్చుకుపోయి ఆక్సిజన్ అందిస్తుంది. దానివలన జుట్టుకు రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. ఉసిరి పొడిని, శీకాకాయ పొడి కలిపి తలకు పెడితే జుట్టు మృదువుగా ధృడంగా తయారవుతుంది. 

అలాగే మెంతిపొడి, ఉసిరిపొడి కలిపి తలకు పెట్టినా తలలో ఉండే చాలా సమస్యలు తగ్గిపోతాయి. నిమ్మరసం తలలోని చుండ్రును తొలగించి జుట్టు ఫాలీ కణాలు బలోపేతం చేస్తుంది. దీనివలన జుట్టు రాలడం తగ్గిపోతుంది. జుట్టులో ఉండే మలినాలు, జిడ్డు తొలగించడంలో నిమ్మరసం చాలా బాగా పనిచేస్తుంది.

 నిమ్మరసం నేరుగా తలకు పెట్టకూడదు. ఆమ్ల లక్షణాలు వలన జుట్టు తెల్లబడుతుంది. ఏదైనా పదార్థాలతో కలిపి పెట్టవచ్చు. ఇలా వారానికి ఒకసారి నెలకు నాలుగుసార్లు వరకూ చేయడంవలన అందమైన తలకట్టు సొంతమవుతుంది.

మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

Leave a Comment

error: Content is protected !!