మనం ప్రతి నిత్యం మెంతులను తాలింపుల్లో వేసుకుంటాం. వీటిని నిల్వ పచ్చల్లలో ఎక్కువ వేసుకుంటూ ఉంటాం. 100 గ్రాముల మెంతులలో 234 కిలో క్యాలరీల శక్తి, కార్బోహైడ్రేట్స్ 11 గ్రాములు, ప్రోటీన్ 25 గ్రాములు, ఫ్యాట్ 5 గ్రాములు, ఫైబర్ 47.5 గ్రాములు. ఇవి ముఖ్యమైన పోషకాలు. ఇక ఔషధ గుణాల్లో మొదటిది బాలింతలకు పాలు బాగా పెరిగే విధంగా ఈ మెంతులు చేస్తాయి. ఎంత ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే రెండు మూడు రోజుల్లో 34 ml పెరుగుతాయి. అందుకని బాలింతలు పిల్లలకు సంవత్సరం రెండు సంవత్సరాలు పాలిస్తే బిడ్డ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. రక్షణ వ్యవస్థకి, ఆరోగ్యానికి, బాడీ స్లిమ్ గా గట్టిగా ఉండడానికి ఉపయోగపడతాయి.
ఇప్పుడు సాధారణంగా పాలు ఉండట్లేదు కాబట్టి మెంతులు పొడిగాని, మెంతులు నానబెట్టుకుని గాని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల పాలు పెరుగుతాయని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. రెండవది మెంతులు మగవాళ్ళు తీసుకుంటే మేల్ హార్మోన్ అయినా టెస్టోస్టిరాన్ లెవెల్స్ ని పెంచుతున్నాయి. అంతేకాకుండా మగవారిలో ఉండవలసిన వీర్యకణాల ఉత్పత్తిని, వీర్యకణాల యొక్క శాతాన్ని బాగా పెంచుతున్నాయి. సంతానం కలగడానికి మగవారు ఎక్కువగా అవకాశం ఈ మెంతులు కలిగిస్తున్నాయి. ఈ రెండు రకాల ఫలితాలను సైంటిఫిక్ గా నిరూపించనది 2011లో అప్లై సైన్స్ అండ్ న్యూట్రిషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్ట్రేలియా వారు పరిశోధన చేశారు.
మూడవది ఈ మెంతుల్లో నికోటినిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లలో ఉండే రక్తనాళాలను వ్యాకోచింప చేసి ఎక్కువ బ్లడ్ జుట్టు కుదుళ్లకు చేరేలా చేస్తుంది. జుట్టు కుదుళ్లు దృఢంగా, బలంగా తయారవ్వడానికి ఇవి ఉపయోగపడతాయి. అలాగే ఈ మెంతులలో లిసితిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉండడం వల్ల జుట్టు కుదుళ్లు ఎప్పుడు హైడ్రేట్ అయ్యే విధంగా చేస్తాయి. ఈ పరిశోధనలు 1972లో ఫ్రాన్స్ వారు నిరూపించారు. అందుకని జుట్టుకి మెంతుల పేస్టుని అప్లై చేసుకోవడం చాలా మంచిది. ఇక ముఖ్యమైన లాభం తీసుకుంటే హైదరాబాదులోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిమ్స్ వారు 66 మంది మీద ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తున్నాయి.
ఈ మెంతులు ఎలా పనికొస్తున్నాయో అని డాక్టర్ పి వి రావు మరియు డయాబెటాలజిస్ట్ బృందం 2015లో పరిశోధన చేసి నిరూపించడం జరిగింది. వీటిని వాడడం వల్ల షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.