రాత్రి పూట బాదం నానబెట్టి తినడం ఆరోగ్య స్పృహ ఉన్న అందరూ చేసే పనే. అయితే చాలామంది పచ్చి బాదం ను కూడా తింటుంటారు. కానీ వాళ్లకు తెలియని నిజం ఒకటుంది పచ్చి బాదం కంటే నానబెట్టిన బాదం ఆరోగ్యానికి చాలా మంచిది మరియు బాదం ను నానబెట్టి తినడమే ఉత్తమమైన మార్గం కూడా. ఎందుకు?? అనే ప్రశ్న అందరికి రావచ్చు కూడా. మరి ఆ ప్రశ్నకు సమాధానం కోసం చదివేయండి. చదివేముందు బాదం లోని పోషకాల రహస్యం కూడా ఒకసారి తెలుసుకుందాం.
బాదంలోని పోషకాలు:
బాదంపప్పులో విటమిన్ ఇ, డైటరీ ఫైబర్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రోటీన్స్ ఎక్కువసేపు సంతృప్తి భావనను కలిస్తాయి. అందువల్ల బరువు తగ్గడానికి ప్రయత్నం చేసేవారు బాదం ను తీసుకోవాలని చెబుతారు. అంతేకాకుండా వీటిలో మాంగనీస్ లో సమృద్ధిగా ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడానికి మరియు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటు సమస్యలు ఉన్నవారికి ఇవి చాలా సహాయపడతాయి మరియు కండరాల మరియు నరాల పనితీరుకు కూడా సహాయపడతాయి.
నానబెట్టిన బాదం ఎందుకు మంచిది??
బాదం యొక్క గోధుమ తొక్కలో టానిన్ ఉంటుంది, ఇది పోషక శోషణను నిరోధిస్తుంది. బాదంపప్పును నానబెట్టిన తర్వాత పై తొక్క సులభంగా వస్తుంది మరియు గింజ అన్ని పోషకాలను సులభంగా విడుదల చేస్తుంది. అర కప్పు నీటిలో కొన్ని బాదంపప్పులను నానబెట్టాలి. వాటిని 8 గంటలసేపు లేదా రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే పరగడుపున పళ్ళు తొమిన తరువాత బాదం పైన పొట్టు తీసి పప్పు తిని నానబెట్టిన నీటిని కూడా తాగేయాలి. ఇలా నానబెట్టిన బాదంపప్పులో ఉండే విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
నానబెట్టిన బాదం యొక్క ప్రయోజనాలు:
జీర్ణక్రియకు సహాయం చేస్తుంది-
బాదం నానబెట్టడం ఎంజైమ్‌లను విడుదల చేయడంలో సహాయపడుతుంది, ఇది జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైమ్ లిపేస్‌ను విడుదల చేస్తుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది –
బాదంపప్పులో ఉన్న మోనోశాచురేటెడ్ కొవ్వులు ఆకలిని అరికడతాయి కాబట్టి వీటిని తినడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడతాయి.
హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది-
చెడు కొలెస్ట్రాల్ (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) ను తగ్గిస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) ను పెంచుతుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం:
నానబెట్టిన బాదంపప్పులో ఉండే విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది, ఇది వృద్ధాప్యం మరియు మంటను నిరోధించే ఫ్రీ రాడికల్ నష్టాన్ని నిరోధిస్తుంది.
క్యాన్సర్‌తో పోరాడటానికి దోహాదం చేస్తుంది-
నానబెట్టిన బాదంపప్పులో విటమిన్ బి 17 ఉంటుంది, ఇది క్యాన్సర్‌తో పోరాడటానికి చాలా ముఖ్యమైనది. బాదంపప్పులో ఉండే ఫ్లేవనాయిడ్ కణితి పెరుగుదలను అణిచివేస్తుంది. గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో మరియు వాటిని నియంత్రించడానికి అలాగే అధిక రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయం చేస్తుంది.
చివరగా….
నానబెట్టిన బాదంపప్పులో ఫోలిక్ ఆమ్లం ఉంటుంది, ఇది పుట్టుకతో వచ్చే లోపాలను తగ్గిస్తుంది. బాదం చాలా అద్భుతమైన పోషక లక్షణాలను కలిగి ఉంటుంది మరియు ఈ సూపర్ ఫుడ్ నుండి అన్ని ప్రయోజనాలను పొందే ఉత్తమ మార్గం మీరు వీటిని క్రమం తప్పకుండా మీ ఆహారంలో చేర్చుకునేలా చూడటం.