ఒక్కోసారి తలనొప్పి ఇబ్బందిపెడుతుంది. అది డీహైడ్రేషన్, లేదా నిద్రలేమి, కంటి సమస్యలు ఇంకా ఏ ఇతర ఆరోగ్యసమస్యలైనా కారణం కావచ్చు. అవికాకుండా ఖచ్చితమైన కారణం లేకుండా వచ్చే తలనొప్పి, సైనస్, మైగ్రేన్ నొప్పి వలన వీపరీతంగా.నొప్పి ఉంటుంది. తలనొప్పి రాగానే అందరూ టాబ్లెట్స్ వేసుకుంటారు.వాటివలన సదుష్ప్రభవాలు రావచ్చు. అందుకే ఇంటి చిట్కాలు ప్రయత్నాంచొచ్చు. దీనిని మిరియాలు ప్రభాళహవవంతంగా ఆపవచ్చు. మిరియాలలో క్యాప్సైసిన్ అనే రసాయనం ఉంది. దీని ఘాటు వలన ముక్కు రంధ్రాలు సక్రమంగా పనిచేసి శ్వాస మెరుగుపడుతుంది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి.
రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరిగి నొప్పి తగ్గుతుంది. ఇది మీ మెదడు యొక్క ట్రిజెమినల్ నరాన్ని తిమ్మిరి చేస్తుంది, ఇక్కడ కొన్ని మైగ్రేన్లు వలన తీవ్రమైన తలనొప్పిమొదలవుతుంది. క్లస్టర్, టెన్షన్ మరియు ఇతర తలనొప్పి ఉన్న ఒక అధ్యయనంలో 10 మందిలో ఏడుగురికి మిరియాలు వలన కొంతకాలం మొత్తం ఉపశమనం కలిగిందని కొన్ని పరిశోధనలు తెలిపాయి. నిమ్మకాయ కూడా తలనొప్పి ని తగ్గిస్తుంది. తలనొప్పి ఒక్కోసారి వికారం, గ్యాస్ ఎసిడిటీ వలన కూడా వస్తుంది. నిమ్మకాయ కడుపుబ్బరం, వికారాన్ని తగ్గిస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు ఈ రెండు పదార్థాలతో చేసుకున్న రెమిడీ చక్కగా పనిచేస్తుంది. ఒకగ్లాసు వేడినీరు తీసుకుని అందులో నాలుగయిదు మిరియాల పొడి వేసుకోవాలి.ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ ద్రవాన్ని తీసుకోవాలి.పనిఒత్తిడి వలన వచ్చే తలనొప్పి కి ఈ ద్రవం బాగా పనిచేస్తుంది.
కొంతసేపు చల్లని గాలిలో కూర్చున్న తలనొప్పి తగ్గుతుంది. ప్రాణాయామం చేస్తూ, ఫోన్,లాప్టాప్ కి కొంచెం విరామం ఇవ్వాలి. ఈ నీటివలన మలబద్దకం తగ్గి కడుపు సమస్యలు తగ్గడం వలన కూడా తలనొప్పి తగ్గుతుంది. నిమ్మకాయ వలన దుష్ప్రభావాలు నిలో వేడుకలుకూడా ఉంటాయి. పుల్లగా ఉండడం వలన విటమిన్ సి ఉండి కడుపులో పురుగులను నశింపచేస్తుంది.నిమ్మకాయ నేరుగా తీసుకోకూడదు. దానిలో ఉండే యాసిడ్స్ వలన ఎసిడిటీ, గుండెల్లో మంట, వాంతులు,గొంతునొప్పి వచ్చే అవకాశం ఉంది. ఆమ్లం వలన అల్సర్ వస్తుంది. పళ్ళను దెబ్బతీయొచ్చు. ఎప్పుడైనా నీటిలో, జ్యూస్లో అయినా కలిపే తీసుకోవాలి. మిరియాలు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. దీనిలో వేడిచేసే గుణం వలన కడుపులో మంట రావచ్చు. అందుకే అవసరమైన మేర మాత్రమే ఉపయోగిస్తూ తలనొప్పి ని దూరం చేసుకుందాం.