పెరుగు మన రోజువారీ ఆహారంలో తప్పకుండా తీసుకోవలసిన ఆహారంగా మన పెద్దలు చిన్నతనం నుండి అలవాటు చేశారు. పిల్లలకు కూడా మన శరీరంలో వేడిని తగ్గించడానికి సిస్టమ్‌ను చల్లబరిచే ఆహారాలను తినాలని పెద్దలు తరచు చెబుతూ ఉంటారు. కానీ అనుకోకుండా కొన్ని సార్లు పెరుగు అందుబాటులో ఉండకపోవచ్చు లేదా తినడం కుదరకపోవచ్చు. దాని వలన ఏమైనా అవుతుందా వేడి చేస్తుందని కంగారు పడుతున్నారా. అయితే పెరుగును అలా తరచు తినకపోయినా ఎటువంటి నష్టం లేదని మంతెన సత్యనారాయణగారు అంటున్నారు. పెరుగు తినడం వలన ప్రత్యేకంగా వచ్చే లాభాలు మిగతా ఆహార పదార్థాలు తినడం ద్వారా కూడా మనం పొందవచ్చు.
రోజువారీ ఆహారంలో ఎక్కువ కూరలు, పుల్కాలు తిని పెరుగు తినకపోయినా ఎటువంటి నష్టం ఉండదు. బయట విందులకు వెళ్లినప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు కూడా చివరలో పెరుగు అన్నం తినడం తప్పనిసరి అనుకుంటారు. కానీ అలా తినకండి. తినకపోయినా ఎటువంటి నష్టం లేదు. మీకు నచ్చిన ఆహారంతో ఆ పూట గడిపేసినా శరీరానికి కావలసిన పోషకాల పరంగా ఎటువంటి నష్టం ఉండదు. పొట్ట ఎప్పుడూ పూర్తిగా నింపేయకూడదు. కొద్దిగా ఖాళీ ఉండడం వలన మంచి నిద్ర పడుతుంది. ఉత్సాహంగా పని కూడా చేసుకోవచ్చు.
మనం చివరలో తినే పెరుగన్నం అధిక ఆహారంగా మారిపోతుంది. ఎప్పుడూ సరిపడా తినడం వలన ఆహారం బాగా జీర్ణమవుతుంది. అలాకాక అతిగా తినడం వలన జీర్ణవ్యవస్థకు ఆటంకం ఏర్పడి తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. అలా అధికంగా తినడం వల్ల ఎసిడిటీ పెరిగి గుండెలో మంట కూడా రావచ్చు. పెద్దవారు నింపిన భావజాలం వలన పెరుగు తినకపోతే వేడి చేస్తుందని భావం మనలో బాగా నిండిపోయింది. దాని వలన కొద్దిగా అసౌకర్యానికి గురవుతారు. కానీ నిజానికి పెరుగు తినకపోవడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఇంకా కావాలి అనుకుంటే మజ్జిగ తీసుకోవడం మంచిది. పెరుగు తినలేదు కనుక ఏదో అవుతుందని ఆలోచించడం మానేయండి.