డ్రైప్రూట్స్ శరీరంలో ఏర్పడిన పోషకాలను అందించడంలోనూ, రక్తహీనత సమస్యలాంటి రోగాలను పారదోలడంలోనూ చాలా బాగా పనిచేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఆరోగ్యం మెరుగ్గా ఉండడానికి కావలసినవి. కాబట్టి వీటన్నింటినీ పొందడానికి డ్రైప్రూట్స్ ఒక వనరుగా అనుకోవచ్చు. అయితే ఆరోగ్యానికి మంచివని ఎక్కువగా ఇష్టమొచ్చినట్లు తినకూడదు. దేనికైనా పరిమితం గా తినడం అవసరం. ఎంత పరిమాణంలో తినాలి. ఎలా తినాలి. ఎప్పుడు తినాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. డ్రైప్రూట్స్ లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే షుగర్స్, క్యాలరీలు కూడా ఉంటాయి. అందుకే రోజుకు ఇరవై గ్రాములకు మించి తినకూడదు. డైరెక్ట్ గా తినడంకూడా మంచిది కాదు. నేరుగా తీసుకోవడంవలన ప్రేగులకు చిరాకు మరియు అసౌకర్యంగా ఉంటుంది. జీర్ణాశయ పనితీరు మందగిస్తుంది. దానివలన జీర్ణాశయ సమస్యలు వస్తాయి. అందువలన రాత్రిపూట నానబెట్టుకుని లేదా ఆరుగంటలు నానబెట్టి అల్పాహారంగా తినడంవలన పోషకాలు రెండింతలు పెరుగుతాయి. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
వీటిని నానబెట్టి తినడంవలన ఇవి కోలన్ అంటే ప్రేగులను శుభ్రంచేస్తాయి. ఏ డ్రైప్రూట్స్అయినా ఎప్పుడు తిన్నా ఇరవై గ్రాములకు మించి తినకూడదు. బాదంలో అమీనోయాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది బ్రెయిన్కి, చర్మానికి మంచిది.ఇవి రక్తప్రసరణ మామూలుగా ఉండడానికి సహాయపడుతుంది. అలాగే రక్తప్రవాహాం మెరుగుపడడానికి సహాయపడుతుంది. అందుకే రోజుకి నాలుగయిదు పొట్టుతీసిన బాదం పప్పు తినాలి.
వాల్నట్స్ పైన పొట్టుతీసాక రుచి అంత బాగుండదు. కానీ ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫిలోఫినిక్ యాసిడ్స్, ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి గుండెసంబంధ వ్యాధులనుండి రక్షిస్తాయి. ఆక్రోట్స్ని రోజుకి మూడునుండి నాలుగు తీసుకోవచ్చు. ఖర్జూరం లో విటమిన్లు, న్యూట్రియంట్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. శరీర మెటబాలిజం స్థాయిలను పెంచుతుంది. ఖర్జూరాలను రోజుకు రెండు, మూడు తీసుకుంటే సరిపోతుంది.
పిస్తా ఆరోగ్యానికి, బలానికి మంచిది. మిగతా డ్రైప్రూట్స్ కంటే ఇందులో ప్రొటీన్ శాతం ఎక్కువ. వీటిని ఇరవై గ్రాములకు మించి తీసుకోకూడదు. జీడిపప్పు క్రమంతప్పకుండా తీసుకోవడంవలన పిత్తాశయంలో రాళ్ళను కరిగిస్తుందని అనేక పరిశోధనల్లో నిరూపితమైంది. రోజుకి నాలుగు చొప్పున వారానికి 28 వరకూ తినవచ్చు. అంతకంటే ఎక్కువ తింటే శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. కిస్మిస్ ఎక్కువగా తిన్నా ఎటువంటి సమస్య లేదు ఇందులో విటమిన్ బి, పొటాషియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజుకి గుప్పెడు తినడంవలన మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిశెగింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, అన్ సాట్యురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండెపోటు ప్రమాదం నివారించడంతో పాటు అధికబరువును తగ్గిస్తుంది. ఇంకా స్ర్తీలలో పిసీఓడీ, జుట్టురాలే సమస్య ను తగ్గిస్తాయి. అందుకే వీటిని వేయించి పొడిచేసి రాత్రి పడుకునేముందు చెంచా తినడం వలన లేదా వేడినీటిలో వేసుకుని తాగడంవలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గర్బవతులు, పిల్లలకు పాలిచ్చే తల్లలు ఇవి తీసుకోకూడదు. అలాగే గుమ్మడిగింజల్లో న్యూట్రియంట్స్ విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి కీళ్ళనొప్పులు తగ్గించి కాన్సర్ కణాలతో పోరాడతాయి.