విదేశాల నుండి మనకు పరిచయమై, ప్రస్తుతం మెల్లిగా అందరికి పరిచయం అవుతూ కాసింత ధర కలిగి ఉన్న పండ్లలో “కివి” కూడా ఒకటి. ఈ పండు రుచికి పుల్లగా పండు లోపల ఆకుపచ్చని కండ మధ్యభాగంలో నువ్వుల్లాగా వలయాకారంలో ఉంటాయి చూడటానికి ఆకారంలో కాసింత సపోటా ను పోలి ఉంటుంది. పట్టణాల్లోనూ, సూపర్ మార్కెట్లలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ పండు ధర ఎక్కువైనప్పటికి అంతే విలువైన ఆరోగ్య ప్రజనాలను చేకూర్చగల పోషకాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలతో నిండిన ఈ పండులో ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, కాపర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ మరియు విటమిన్ కె వంటి పోషకాలు ఉన్నాయి.
కివి రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది
రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి మరియు రక్తంలో కొవ్వు పరిమాణాన్ని తగ్గించడం ద్వారా రక్తపోటును క్రమబద్దీకరించడానికి కివి పండు తీసుకోవడం ఉత్తమ ప్రత్యామ్నాయం. రోజుకు 2 నుండి 3 కివి పండ్లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఆస్తమా నుండి ఉపశామనన్ని కలిగిస్తుంది.
శ్వాస సంబంధ సమస్య అయిన ఉబ్బసం శరీర సామర్త్యాన్ని బలహీనపరుస్తుంది. శ్వాస తీసుకోవాదానికి అంతరాయం కలిగిస్తూ ఇబ్బంది పెట్టే ఈ సమస్యకు కివి మంచి ఔషధంగా పనిచేస్తుంది. వీటిలో ఉన్న విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉబ్బసం యొక్క లక్షణాలను నియంత్రించడంలో సహాయపడతాయి. కివిని క్రమం తప్పకుండా తినేవారిలో ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంటుంది..
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
కివిలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫైబర్ కంటెంట్ కాకుండా, కివిలో ఎంజైమ్, ఆక్టినిడిన్ కూడా ఉంది, ఇది గట్ లోని ప్రోటీన్లను సమర్థవంతంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అజీర్తి అనిపించిన్నపుడు కివి పండును తింటే ఉపశమనం లభిస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది.
అధిక రక్తపోటును తగ్గించడానికి మరియు గుండెపోటు మరియు స్ట్రోక్ వంటి సమస్యలను నివారించడానికి కివీ సహాయపడుతుంది. 8 వారాలపాటు రోజుకు 3 కివీస్ తిన్నవారికి వారి డయాస్టొలిక్ మరియు సిస్టోలిక్ రక్తపోటు తగ్గుతుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్, లుటీన్ ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించే సామర్థ్యాన్ని కలిగిఉంటుంది.
రోగనిరోధకశక్తి పెంచుతుంది.
సెల్యులార్ పనితీరుకు మరియు శరీరంలో ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించడానికి విటమిన్ సి ముఖ్యమైనది. ఇది కణజాలాల పెరుగుదల మరియు మరమ్మత్తుకు కూడా దోహాధం చేస్తుంది. కివి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా తయారవుతుంది.
డీఎన్ఏ నష్టాన్ని తగ్గిస్తుంది
శరీరంలో ఫ్రీ రాడికల్స్ మరియు యాంటీఆక్సిడెంట్ల అసమతుల్యత ఆక్సీకరణ ఒత్తిడి, DNA సామర్థ్యాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. ఇది శరీరంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది, కివి ని తీసుకోవడం ద్వారా ఈ వ్యవస్థ పటిష్టమవుతుంది.
కంటి చూపు మెరుగుపరుస్తుంది.
కివిలో జియాక్సంతిన్ మరియు లుటిన్ ఉన్నాయి. ఈ రెండు సమ్మేళనాలు యాంటీఆక్సిడెంట్ల మాదిరిగానే పనిచేస్తాయి అలాగే కళ్ళకు అవసరమైన పోషకమైన విటమిన్ ఎ ఏర్పడటానికి సహాయపడతాయి. ఇవి కంటి రెటినాను దెబ్బతీసే అదనపు కాంతిని కూడా గ్రహిస్తాయి మరియు కంటిశుక్లం, కంటి సంబంధిత వ్యాధుల నుండి కంటిని రక్షిస్తాయి.
చివరగా……
కివి పండును రోజూ తీసుకోవడం వల్ల విటమిన్ సి లోపాన్ని జయించడం మాత్రమే కాకుండా, చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవడం, మరియు ఎర్రరక్త కణాలను ఆశించిన మోతాదులో పెంచుకోవడానికి దోహదపడుతుంది.