మన తెలుగురాష్ర్టాల్లో ఆరోగ్య రక్షణలో భాగంగా డ్రైప్రూట్స్ రోజూ తినేవారి సంఖ్య పెరిగింది. కానీ డ్రైప్రూట్స్ అలాగే తినవచ్చా. అలా తినడం వలన మలబద్దకం ,గ్యాస్ ట్రబుల్ వస్తుందా అనేది అందరికీ ఉన్న అనుమానం. నిజనిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అది నిజంకాదు.
మామూలుగా డ్రైప్రూట్స్ తినడం అనేది కొంతమందికి అలవాటుగా మారిపోయింది. కొంతమంది చిరుతిళ్ళుగా కూడా డ్రైప్రూట్స్ ఇస్తుంటారు పిల్లలకు. కానీ ఇలా బాదం, జీడిపప్పు, వాల్నట్స్ వంటి గింజలు తినడం వల్ల డయాబెటిస్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అలాగే కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలు వంటివి తగ్గించి అనేక విధాలుగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పరిమితంగా తీసుకున్నప్పుడు వీటిలో ఉండే పోషకరమైన హై-ఫైబర్ మీబరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది .
ఇందులో అధిక కేలరీల సంఖ్య ఉన్నప్పటికీ మీరు వాటిని మితంగా తిన్నంతవరకు ఈ గింజలు ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంగా, రుచికరంగా ఉంటాయి. మనలో ఉండే పోషకాహరలోపాన్ని కూడా సరిచేస్తాయి.
అయితే ఈ గింజలను ఎలా తినాలి. డ్రైప్రూట్స్ ఏవైనా రాత్రి నానబెట్టి ఉదయాన్నే నీటిని తీసేసి ఆ గింజలను తినడంవలన గింజలలో పెరిగే పోషకాలు శరీరానికి మరింత బలాన్ని అందిస్తాయి.
మామూలుగా తిన్నప్పుడు ఈ గింజలు పూర్తిగా జీర్ణంకావు. కనీసం ఇరవై నుండి ముప్ఫైశాతం మలంలో బయటకు వెళ్ళిపోతాయి. ఖరీదైన గింజలు ఇలా వ్యర్థం అవడం కంటే శరీరానికి ఆందడం మనకు ముఖ్యం కదా. అలాగే పొడి గింజలను తిన్నప్పుడు వాటినుంచి విడుదలయ్యే నూనె నోటిలో వికారం కలిగించొచ్చు. అందుకే గింజలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినడం అలవాటు చేసుకోండి.
ఇలా నానబెట్టి తినడం వలన శరీరంలో ఫైటిక్ ఆమ్లాలను తగ్గిస్తుంది మరియు ప్రోటీన్, ఐరన్, జింక్ మరియు కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు మరియు ఖనిజాల శోషణను శరీరం మెరుగుపరుస్తుంది.
శరీరంలో టానిన్లు మరియు పాలీఫెనాల్స్ను తగ్గిస్తుంది. యాంటీ న్యూట్రిషనల్ ఎంజైమ్ ఇన్హిబిటర్లను తగ్గిస్తాయి. గ్యాస్ కలిగించే సమ్మేళనాలను తొలగిస్తాయి. బరువు తగ్గించి శరీర ఆకృతిని మెరుగుపరుస్తుంది మరియు కడుపు నిండిన భావన కలిగిస్తాయి.