పెసలను నానబెట్టి చాలా వంటలు చేసుకుంటాం. గారెలు, పునుగులు, పెసరట్టు వేసుకుంటాం. పప్పు గా చేసుకుని రవ్వగా చేసుకుని తింటాం. పెసర్లు పచ్చ ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి. పెసర్లతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, మెగ్నీషియం, రాగి, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పెసలు పోషకాలు నిండిన ఆహారభని పోషకాహర నిపుణులు సైతం చెబుతారు. పెసలలో పోలేట్, విటమిన్ బి9 లేదా ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండడం వలన శరీరంలో కణాలను ముఖ్యంగా ఎర్రరక్తకణాలను వృద్ధి ళచేయడంలో సహాయపడుతుంది. మరియు నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
గర్బవతులకు తగినంత ఫోలెట్ ఉండడం చాలా అవసరం. గర్బం కావాలనుకునేవారు కూడా ఫోలెట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పోలెట్ అధికంగా ఉన్న ఆహారం వలన లోపలి పిండంలో లోపాలు, గర్బస్రావం కాకుండా కాపాడుకోవచ్చు. ఫ్లెవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడంవలన ప్రీరాడికల్స్తో పోరాడి యాంటీఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తాయి. రక్తనాళాలకు ప్రీరాడికల్స్తో జరిగే నష్టాన్ని అరికడుతుంది. అలాగే మంటను కూడా తగ్గిస్తుంది. నాళాల్లో రక్తప్రవాహం బాగా జరిగేలా చేస్తుంది. పెసలలో ఉండే విటమిన్ బి2 సాధారణ హృదయస్పందనను నిర్వహించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం వలన గుండె సంబంధ వ్యాధులు రాకుండా చేస్తాయి.
శరీరంలోని విషపదార్థాలు బయటకు పంపుతుంది. కొత్త కణాలను, ఎముకలు, హిమోగ్లోబిన్ ఏర్పడడానికి సహాయపడుతుంది. పెసర్లలో కొవ్వు తక్కువ శక్తి ఎక్కువగా ఉండడం వలన కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉండేలా చేస్తుంది. ప్రొటీన్లు గ్లూకోజ్, లిపిడ్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. మరియు కొవ్వు పేరుకోకుండా చేస్తాయి. దీనివలన అధికబరువు సమస్య ఉండదు. దీనిని తింటూ వ్యాయామం చేయడంద్వారా బరువు తగ్గవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉండడం వలన సోడియం ను బయటకు పంపుతుంది. రోగనిరోధక వ్యవస్థ ను పటిష్టం చేస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం ఎక్కువ ఉండడం వలన ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. కీళ్ళనొప్పులు, కాళ్ళనొప్పులు అందరికీ వచ్చేస్తున్నాయి. పెసలను తినడంవలన నొప్పులను తగ్గించుకోవచ్చు.
వయసుపెరిగేకొద్దీ వచ్చే మతిమరుపు తగ్గిస్తాయి. విటమిన్ బి12 ఉండడం వలన ఆహారంనుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. శక్తిని నిరహల్వచేసుకునని ఉపయోగిఃచుకునే శక్తిని పెంచుతుంది. యాంటీ ట్యూమర్ లక్షణాలు వలన కాన్సర్ రాకుండా చేస్తుంది. ప్రీరాడికల్స్తో పోరాడి కాన్సర్ రాకుండా చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ నియంత్రణ లో సహాయపడతాయి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వలన మలబద్దకం, గ్యాస్ తదితర సమస్యలు తగ్గించడంలో ముందుటుంది. ఇన్ని సుగుణాలున్న పెసలను వారంలో రెండు సార్లయినా ఆహారం లో భాగం చేసుకోవాలి.