మారిపోయిన జీవనవిధానంలో మనం తినే ఆహారం వలన ఎసిడిటీ, మలబద్దకం, అజీర్తి, అల్సర్లు ప్రాణాంతక వ్యాధులైన గుండెజబ్బులు వస్తున్నాయి. గుండెజబ్బులు వలన ప్రాణాలు కూడా పోవచ్చు. వీటికోసం మనం అనేక ఇంగ్లీషు మందులు వాడతాం. ఖరీదైన ఈ మందులు వలన దుష్ఫలితాలు కూడా ఉంటాయి. మన చుట్టూ ఉండే చెట్టుతో ఈ వ్యాధులను దూరం పెట్టొచ్చు. అవే రేగిపండ్లు. సీజన్లో దొరికే రేగిపండ్లు వలన ఎన్ని లాభాలు ఉంటాయో రేగిచెట్టు ఆకులు వలన కూడా అంతే లాభాలు ఉంటాయి. రేగుపళ్ళలో అనేక పోషకాలు ఉంటాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..
నూట్రిషన్స్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి చలికాలంలో వచ్చే ఫ్లూలు జ్వరాలనుండి రక్షిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి ఆరోగ్యాన్ని కాపాడతాయి. రేగుపళ్ళ జ్యూస్ తాగడంవలన చెడుకొవ్వును కరిగించి అధికబరువును తగ్గిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన మలబద్దకాన్ని తగ్గించి ఫైల్స్, ఫిష్ట్యులా లాంటి వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. రక్తహినతతో బాధపడేవారికి రేగుపళ్ళలో ఐరన్ పుష్కలంగా లభించి రక్తహీనత ను తగ్గిస్తుంది.
ఉదయాన్నే నాలుగు రేగు ఆకులను తినడం వలన గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. ఎసిడిటీ, అజీర్తి వలన వచ్చే కడుపునొప్పి కి ఈ ఆకులు తినడంవలన ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అస్తమానం జలుబు, దగ్గుతో బాధపడేవారికి ప్రతిరోజూ ఈ ఆకులు తినడంవలన మంచి ఫలితం ఉంటుంది. మొటిమలు, మచ్చలు, చర్మం నల్లబడటంతో బాధపడేవారు ఈ ఆకులు పువ్వులను నూరి ఆ పేస్ట్ తో ముఖానికి లేపనంలా వేసుకుంటే ముడతలు తగ్గిస్తాయి.
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయీ.
విటమిన్ సి చర్మంలోని మచ్చలు, మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. గాయాలకు ఈ ఆకుల పేస్ట్ రాస్తే త్వరగా మానిపోతాయి. ఇమ్యునిటీని పెంచి కాన్సర్ కణాలతో పోరాడే శక్తి ని కలిగిఉంటాయి. ఒక పది ఆకులను కషాయంలా చేసుకుని తాగడంవలన గొంతునొప్పి, హిస్టిరియా లాంటి వ్యాధులను తగ్గించుకోవచ్చు.అలాగే ఇందులో ఉండే పొటాషియం ఎముకలను బలోపేతం చేసి మెనోపాజ్ దశలో వచ్చే ఓస్థిరియో పోరొసిస్ రాకుండా చేస్తుంది.రేగు ఆకుల్లో ఉండే బీటాకెరొటిన్ కళ్ళలో ఏర్పడే శుక్లాలను నిరోధిస్తుంది.