Health Benefits of Mustard Oil

ఆవ నూనె గూర్చి ఆశ్చర్యపరిచే నిజాలు!!

ప్రతి వంటకు పోపు వేసినప్పుడు ఉపయోగించే ఆవాల నుండి తయారుచేసే ఆవ నూనె చాలా శ్రేష్ఠమైనది.  ఈ ఆవ నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గూర్చి చాలా మందికి తెలియదు. అయితే ఒకసారి ఈ సారాంశాన్ని చదివితే మీకే అర్థమవుతుంది ఆవ నూనె అంత శక్తివంతమైన మరియు ఆరోగ్య ప్రయోజనాలు కలిగివుందో.

 ఆరోగ్యవంతమైన కొవ్వులు కలిగి ఉంటుంది.

 “ఆవ నూనె మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలతో నిండిన కారణంగా దీన్ని ఉపయోగించడానికి ఉత్తమమైనది.. మన శరీరానికి అవసరమైన  3: 1 నిష్పత్తిలో పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు మూడు భాగాలు మరియు సంతృప్త కొవ్వు ఆమ్లాల యొక్క ఒక భాగం  పాలీఅన్‌శాచురేటెడ్ ఆవనూనెలో లభిస్తాయి.

 గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది

 శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా రక్తంలో కొవ్వు స్థాయిలను ఎప్పటికప్పుడు సమతుల్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు ఇది రక్తప్రసరణకు సహాయపడుతుంది. ఇందులో ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం అధికంగా ఉండటం వల్ల హృదయ సంబంధ వ్యాధులకు  ఆవనూనె వాడకం పొద్దుతిరుగుడు నూనె వాడకం కంటే తక్కువ రిస్క్ కలిగి ఉంటుంది. 

 పగిలిన మడమలు మరియు పెళుసైన గోళ్లకు చికిత్స చేస్తుంది

 మడమల పగుళ్లు తగ్గించుకోవడానికి కొవ్వొత్తిని కరిగించి కరిగిన ద్రవానికి సమానమైన ఆవనూనెను కలపడం వల్ల అది ఇంకా ఎక్కువ చిక్కదనం సంతరించుకుంటుంది. ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని కాలి మడమలకు రాత్రి పూట అప్లై చేసి ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల  పగిలిన కాళ్ళ మడమలు మాయమయ్యి తొందరగా పాదాలు నాజూగ్గా, ఆరోగ్యవంతంగా మారతాయి. అంతే కాదు ఆవనూనె ను గొర్లపై కొన్ని చుక్కలు వేసి సున్నితంగా మర్దనా చేయడం గోర్లు ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా గోరు పెరుగుదల కూడా సమర్థవంతంగా ఉంటుంది. ముఖ్యంగా పిప్పిగోళ్ళు ఉన్నవారికి ఇది ఎంతో గొప్పగా పనిచేస్తుంది.

 అంటువ్యాధులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది

 ఆవ నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి.  దీన్ని వంటల్లో వాడటం మరియు శరీరంపై పూతగా వాడటం వల్ల  జీర్ణవ్యవస్థను రక్షించడమే కాకుండా  చర్మవ్యాధులైన అంటువ్యాధులతో పోరాడటానికి అనేక విధాలుగా సహాయపడుతుంది.

 రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

 ఆయుర్వేదం ప్రకారం, బాడీ మసాజ్ కోసం ఆవ నూనెను ఉపయోగించడం వల్ల రక్త ప్రసరణ, చర్మ నిర్మాణం మెరుగుపడుతుంది మరియు కండరాలకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.   ఇది చెమట గ్రంథులను కూడా సమర్థవంతంగా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. తద్వారా శరీరంలో మలినాలను బయటకు పంపేందుకు పరోక్షంగా దోహాధం చేస్తుంది.  

 చర్మానికి మంచిది

 ఆవ నూనె చర్మానికి అవసరమైన విటమిన్ ఇ తో నిండి ఉంటుంది.  అందువల్ల చర్మంపై ఉన్న గీతలు, ముడుతలు, మచ్చలు వంటి చర్మ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఇది సహజమైన సన్‌స్క్రీన్‌గా పనిచేస్తుంది.  సాంప్రదాయకంగా  పిల్లలకు తరచుగా ఆవ నూనెతో మసాజ్ చేస్తారు.  అయితే జిడ్డు చర్మం గలవారికి ఇది చికాకును మరియు అసహనాన్ని కలిగించే అవకాశం ఉంది. అందుకే పరిమితమైన మోతాదులో ఉపయోగించుకోవడం ఉత్తమం. చర్మసంబంద ఉత్పత్తులలో వాణిజ్య సంస్థలు ఆవనూనెను జోడించడం కొసమెరుపు. 

 దగ్గు మరియు జలుబు నుండి ఉపశమనం

 దగ్గు మరియు జలుబు చికిత్సకు ఆవనూనె ఉపయోగించడం తరాలుగా ఉపయోగిస్తున్న పద్ధతి.  “శ్వాసకోశంలొ ఏర్పడే ఇబ్బందిని తొలగించడంలో ఆవనూనె గొప్పగా పనిచేస్తుంది. ఆవ నూనెను వేడి నీటిలో వేసి ఆవిరి పట్టుకోవడం ద్వారా దగ్గు జలుబు సులువుగా తగ్గుతాయి. అలాగే  నిద్రపోయే ముందు టీస్పూన్ ఆవనూనెను ఛాతీపై రుద్దడం ద్వారా కూడా మంచి ఫలితం ఉంటుంది. .  

 జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

 ఆవనూనెను మసాజ్ కోసం ఉపయోగించడం ద్వారా జుట్టు పెరుగుదల నమ్మకశక్యం కానంతగా ఉంటుంది.  ఆవ నూనెలో బీటా కెరోటిన్ ఉంటుంది,  మసాజ్ చేసినప్పుడు రక్త ప్రసరణను పెంచి జుట్టు కుదుళ్లకు బలం చేకూరుస్తుంది. మరియు జుట్టుకు సంబందించిన చుండ్రు, కురుపులు, వంటి సమస్యలను అరికడుతుంది.  

చివరగా….

ఎవరికీ తెలియని ఇన్ని ఆరోగ్య రహస్యాలు ఆవనూనెతో మీరు పొందండి ఇక.

1 thought on “ఆవ నూనె గూర్చి ఆశ్చర్యపరిచే నిజాలు!!”

Leave a Comment

error: Content is protected !!