health benefits of peepal tree ravichettu

రావి చెట్టు గురించి పరమ రహస్యం ఇదే

ప్రియమైన మిత్రులారా.. రావి చెట్టు వృక్షాలన్నింటిలో పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. అంతేకాదు మన భారతీయ ఆయుర్వేదం కూడా రావి చెట్టు గురించి ఎంతో గొప్పగా వివరించింది. ఎన్నో నయంకాని మొండి రోగాలను రావి చెట్టు తగ్గిస్తుందని ఎన్నో ఆయుర్వేద గ్రంథాలలో వివరించడం జరిగింది. రావి చెట్టు ను ఉపయోగించి సంతానభాగ్యం కలిగించవచ్చని మన ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి.


చాలామంది నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు నడుము నొప్పిని రావిచెట్టు తగ్గిస్తుంది. దీని కోసం రావి చెట్టు తాజా బెరడు సేకరించి ముక్కలు చేసి నీడలో ఆరబెట్టి పొడి చేయాలి. దీనిని అరస్పూను మోతాదులో తీసుకొని ఒక కప్పు నీటిలో వేసుకుని రెండు పూటలా తాగుతూ ఉంటే నడుము నొప్పి తగ్గుతుంది. అంతే కాదు ఇలా తీసుకుంటూ ఉంటే శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది.

రావిచెట్టు లేత చిగుర్లు 400 గ్రాములు తీసుకుని నాలుగు లీటర్ల నీటిలో వేసి ఒక లీటర్ కషాయం మిగిలే వరకూ మరిగించి వడపోసి దానిలో ఒక కేజీ చక్కెర కలిపి కరిగించి చిన్న మంటపై పాకం వచ్చే వరకు మరిగించి దించి చల్లార్చి నిల్వ చేసుకోవాలి. ఈ లేహ్యాన్ని రెండుపూటలా 10 గ్రాముల మోతాదులో తింటూ ఉంటే స్త్రీ పురుషులలో శారీరక శక్తి కామ శక్తి పెరుగుతాయి.

పిల్లలకు పెద్దలకు బలం కలగాలంటే రావి చిగురు 10 తీసుకొని అరగ్లాసు ఆవు పాలలో వేసి మరిగించి కండ చక్కెర కలిపి రెండు పూటలా తాగుతూ ఉంటే శక్తి జ్ఞాపక శక్తి ప్రతిభ పెరుగుతాయి.

చాలా మందికి కాళ్ళు పగిలి సమస్య ఉంటుంది. దీనికోసం రావి ఆకులను దంచి రసం తీసి ఈ రసాన్ని రాత్రి పడుకునే ముందు కాళ్ళ పగుళ్ళకు లేపనం చేసి పడుకుంటే కొన్ని రోజులలోనే పాదాల పగుళ్లు పోయి నాజూగ్గా తయారవుతాయి.

తరచూ చాలామందికి నోటిపూత ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో రావి చెట్టు బెరడును సేకరించి దానిని రాయిపై అరగదీసి గంధంలా తీసి ఆ గంధాన్ని నోటిలో లేపనంగా చేసుకుంటే నోటి పూత నోటిలో పుండ్లు పోతాయి.

దంతాలు చిగుళ్లు గట్టిగా మారాలంటే రావి చెట్టు బెరడును నీటిలో వేసి మరిగించి కషాయంలా కాచి గోరు వెచ్చగా ఉండగానే రెండు పూటలా నోట్లో పోసుకొని పుక్కలిస్తే చిగుళ్ల నుండి రక్తం కారటం ఆగిపోయి దంతాలు గట్టిగా మారతాయి. 80 సంవత్సరాలు వచ్చినా పళ్ళు ఊడవు.

పెళ్లి అయ్యి పది సంవత్సరాలు అవుతున్నా ఇంకా పిల్లలు కలగకపోతే రావి చెట్టు బెరడును సేకరించి నీడలో బాగా ఆరబెట్టాలి. బాగా ఎండిన తర్వాత దంచి చూర్ణం ఎలా చేసుకోవాలి. మెత్తని గుడ్డలో వేసి వస్తధారితం పట్టి  ఈ చూర్ణాన్ని భద్రపరుచుకోవాలి. 50 గ్రాముల చుర్ణానికి  50 గ్రాముల పటిక బెల్లం కలిపి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక గ్రాము చూర్ణాన్ని ఆవు పాలలో కలిపి పటిక బెల్లం కలిపి తాగాలి. ఇలా రెండు నెలలపాటు చేస్తే ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!