ఉల్లిపాయ లేని వంట రుచించదు. మన జీవితంలో ఉల్లి అంతలా బాగమైపోయింది. అయితే చాలా రకాల వంటలలో చాలామంది ఉల్లి కాడలు వాడుతుంటారు. వీటి వల్ల వంటకు బోలెడు రుచి మాత్రమే కాకుండా ఈ ఉల్లి కాడలతో చేసే కూరలు అద్భుతంగా ఉంటాయి. ఇంకా కొన్ని ఖరీదైన వంటకాల్లో ఉల్లి కాడలను వంటకు అలంకరణ గానూ, అదనపు రుచి కోసం చేర్చడం వంటి పద్ధతులు పాటిస్తూ ఉంటారు. ఈ ఉల్లి కాడలు వల్ల ఆరోగ్య ప్రయోజలు బోలెడు ఉన్నాయ్. వాటిని విన్నారంటే ఆశ్చర్యపోవడం ఖాయం. మరి చూడండి.
◆వీటిలో యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్ తో సమర్థవంతంగా పోరాడి శరీర కణజాలాన్ని దిబ్బతినకుండా కాపాడటంలో ఉల్లి కాడలు ఉపయోగపడతాయి. ఉల్లి కాడలులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో అధిక కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, అంతేకాదు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు కొరోనరీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
◆ ఉల్లి కాడల్లో అధిక స్థాయిలో విటమిన్ సి మరియు విటమిన్ కె ఉంటాయి, ఇవి రెండూ ఎముకల సమార్గవంతంగా ఉండేందుకు అవసరమవుతాయి. విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణలో సహాయపడి ఎముకలను బలంగా చేస్తుంది, ఎముక సాంద్రతను కాపాడుకోవడంలో విటమిన్ కె కీలక పాత్ర పోషిస్తుంది.
◆ యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ-వైరల్ లక్షణాలు సమర్థవంతంగా ఉన్న ఉల్లి కాడలు స్ప్రింగ్ వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫ్లూ, జలుబు మొదలైన వాటిని తగ్గించడంలో తోడ్పడతాయి. ఇవి శ్వాసకోశ వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు సహాయపడతాయి కఫాన్ని తగ్గిస్తాయి.
◆ ఆకుపచ్చ రంగులో ఉండే ఈ ఉల్లి కాడలు తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం సంరక్షిస్తుంది. కంటి ఆరోగ్యానికి దోహాధం చేసే లుటిన్ మరియు జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్లు ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది సహజంగానే దృష్టిని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే కళ్ళను మంట నుండి కాపాడటానికి మరియు కళ్ళు అలసిపోవడం వంటి వాటి నుండి కూడా కళ్ళకు ఉపశమనాన్ని ఇస్తుంది.
◆ ఉల్లి కాడల్లో అల్లైల్ సల్ఫైడ్ అని పిలువబడే శక్తివంతమైన సల్ఫర్ కలిగిన సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది, ఇది పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. క్వాంథిన్ ఆక్సిడేస్ ఎంజైమ్ ఉత్పత్తిని నిరోధించడం ద్వారా క్యాన్సర్‌ను నివారించడంలో ఫ్లేవనాయిడ్లు సహాయపడతాయి, క్యాన్సర్‌తో పోరాడే ఆహారాన్ని తినడంతో పాటు, మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
◆వీటిలో సల్ఫర్ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెరను శరీర కణాలకు రవాణా చేయడానికి అవసరమైన ఇన్సులిన్ అనే హార్మోన్ స్థాయిని పెంచడం ద్వారా చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
◆ జీర్ణాశయ సమస్యల నుండి ఉపశమనం కోసం ఉల్లికాడలు ఉపయోగపడతాయి. అతిసారం మరియు ఇతర కడుపు సమస్యలను నివారించడానికి శక్తివంతమైన సహజ నివారణగా పనిచేస్తాయి. వీటితో పాటు అధిక మొత్తంలో ఫైబర్‌తో నిండి ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను మరియు ఉదర సమస్యలను తగ్గించడంలో దోహాధం చేస్తాయి.
◆ వీటిలో ఉండే సల్ఫర్ అనే ఖనిజం శిలీంధ్ర పెరుగుదలను నిరోధిస్తుంది, మరియు విటమిన్ కె రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. రక్త ప్రసరణ మరియు విటమిన్ బి1 ను పీల్చుకునేలా చేయడం ద్వారా ఒత్తిడి మరియు అలసట తగ్గిస్తుంది.
చివరగా….
ఉల్లి కాడలు ఆరోగ్యానికి మరియు రుచి కి కూడా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మరవకండి.