Health Benefits of Sweet Corn-Telugu

తీపి మొక్కజొన్నలో ఆరోగ్యం గూర్చి మీకెంత తెలుసు!!

చిన్నప్పటి నుండి మనకు బాగా అలవాటు అయిన వాటిలో మొక్కజొన్న కూడా ఒకటి. గ్రామీణ ప్రాంతాల నుండి, పట్టణాల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. మొక్కజొన్నలో కొవ్వు తక్కువగా ఉంటుంది సోడియం లేదా కొలెస్ట్రాల్ ఉండదు.  ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది మరియు ఫైబర్ సమృద్ధిగా కలిగి ఉంటుంది. అయితే ఇప్పటి ట్రెండ్ మాత్రం స్వీట్ కార్న్ దే అని చెప్పవచ్చు. ఉడికించి తినడం నుండి,ఎన్నో రకాల వంటకాలు కూడా అద్భుతంగా తయారుచేసుకుని అంతే అద్భుతమైన ఆరోగ్యాన్ని దీని వల్ల పొందవచ్చు. తియ్యని రుచిని ఇస్తూ బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తీపి మొక్కజొన్న తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు చూడండి మరి.

 వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది

  ఇది వృద్ధాప్య ప్రక్రియను నిదానం చేస్తుందంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇది నిజమే. ఇందులో వయసు ద్వారా శరీరంలో కలిగే మార్పులను ఆలస్యం చేయడానికి ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీలును బట్టి స్వీట్ కార్న్ ను తరచుగా తినడం వల్ల ఈ ప్రయోజనం పొందవచ్చు.

 చర్మ ఆరోగ్యాన్ని  పెంచుతుంది

తీపి మొక్కజొన్నలో చర్మ ఆరోగ్యానికి  అవసరమైన ఖనిజాలు మరియు విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మానికి తేమను చేకూర్చి చర్మం మృదువుగా ఉండేలా చేయడంలో దోహాధం చేస్తుంది. ముఖ్యంగా చర్మాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.  

 ముఖం మీద మొటిమలు మరియు మచ్చలను తొలగిస్తుంది

 విటమిన్ ఇ అధికంగా ఉండటం వల్ల, తీపి మొక్కజొన్న  పేస్ట్ ముఖ మొటిమల మచ్చలను తొలగించడానికి అద్భుతాలు చేస్తుంది. ఇది సాగిపోయిన చర్మ రంధ్రాలను తిరిగి సాధారణ రూపానికి తీసుకొచ్చి చర్మ రంద్రాలలో పేరుకున్న మలినాలను తొలగిస్తుంది.

  రక్త ప్రసరణను పెంచుతుంది

 తీపి మొక్కజొన్న నూనెను తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణను పెంచుతుంది, తద్వారా ఫోలికల్స్ ఆరోగ్యకరమైన మరియు బలమైన ఒత్తిడిని ఉత్పత్తి చేస్తాయి. రక్తప్రసరణ ఎంత చక్కగా ఉంటే జుట్టు పెరుగుదల  కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా కుదుళ్ళు దృడంగా తయారవుతాయి.

జుట్టును బలపరుస్తుంది

 తీపి మొక్కజొన్నలో ఉండే విటమిన్ సి, లైకోపీన్ మరియు అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లు జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడతాయి.  జుట్టు రాలడాన్ని ఎదుర్కోవడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.

  రక్తహీనత నిర్మూలిస్తుంది

 తీపి మొక్కజొన్నలో విటమిన్ బి 12, ఐరన్ మరియు ఫోలిక్ ఆమ్లం చాలా ఉన్నాయి.  ఈ పోషకాల లోపం రక్తహీనతకు కారణమవుతుంది. అదే తీపి మొక్కజొన్నను తీసుకోవడం వల్ల ఈ పోషకాల లోపాన్ని సులువుగా అధిగమించవచ్చు. అనిమియాతో బాధపడేవారు ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం.  

 కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

 స్వీట్ కార్న్ లో కరిగే ఫైబర్ కూడా ఉంటుంది, ఇది రక్త ప్రవాహంలో జెల్ లాంటి పదార్థంగా మారుతుంది.  ఈ జెల్ చెడు కొలెస్ట్రాల్ ను గ్రహిస్తుంది.  స్వీట్ కార్న్ లో కెరోటినాయిడ్స్ మరియు బయోఫ్లవనోయిడ్స్ కూడా ఉన్నాయి.  ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి 

 దృష్టిని మెరుగుపరుస్తుంది

 తీపి మొక్కజొన్న లో బీటా కెరోటిన్ ఉంటుంది, ఇది విటమిన్ ఎ ను ఉత్పత్తి చేస్తుంది, ఇది మంచి దృష్టిని ప్రోత్సహిస్తుంది.  కెరోటినాయిడ్లు మాక్యులర్ డీజెనరేషన్ ను కూడా తగ్గిస్తాయి, కంటి చూపును మెరుగుపరచడంలో ఉత్తమంగా పనిచేస్తాయి.

 శక్తిని సమకూరుస్తుంది

 స్వీట్ కార్న్ ఒక పిండి ధాన్యం,  ఇది ఇతర కూరగాయల కంటే ఎక్కువ శక్తిని ఇస్తుంది  కాబట్టి తీలి మొక్కజొన్న తీసుకునేవారిలో  ముఖ్యంగా కండరాల పనితీరు అద్భుతంగా ఉంటుంది. అలాగే క్రీడాకారులు దీన్ని తమ ఆహారంలో తప్పక  చేర్చుకుంటారు. 

 చివరగా…..

స్వీట్ కార్న్ అనేది విదేశాల నుండి మనల్ని చేరి మన మనసులను దోచేసినదే అయినా ఇందులో పోషకాలను ఆరోగ్య ప్రయోజనాలకు సలాం కొట్టాల్సిందే.

Leave a Comment

error: Content is protected !!