ఈరోజు మనం తులసి ఆకులతో ఒక మంచి డ్రింక్ తయారు చేసుకుందాం ఈ డ్రింక్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తులసి ఔషధీ పరంగానూ హిందూ సాంప్రదాయం లోనూ ఎంతో ప్రాధాన్యం ఉన్న ఒక మొక్క. ఇందులో రెండు జాతులున్నాయి ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అని , కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అని పిలుస్తారు.
తులసి మొక్కలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉండటం వలన అనేక మందులలో తులసి ఆకులను ఉపయోగిస్తారు అంతే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా తులసి ఆకులను తులసి విత్తనాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఆకుల లో విటమిన్ ఏ విటమిన్ సి కె క్యాల్షియం మెగ్నీషియం పాస్ఫరస్ ఐరన్ పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ప్రోటీన్లు ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ఉండే ఆరోగ్యప్రయోజనాలు గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
రోగనిరోధకశక్తిని శరీరంలో పెంచడానికి సహాయపడుతుంది. తులసి లో విటమిన్ సి జింక్ సమృద్ధిగా ఉండటం వలన సిద్ధమైన రోగనిరోధక శక్తిని పెంచేలా పనిచేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. తులసి ఆకులు 10 నుండి 12 తీసుకోవాలి. యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ లక్షణాలు ఉండటం వలన జ్వరం వంటి సమస్యలు వచ్చినప్పుడు ఉపశమనం కలిగేలా చేస్తుంది.