healthiest sugar substitute for weight loss

హానికారకమైన పంచదార స్థానంలో ఉపయోగించండి ఈ 6 ఆరోగ్యవంతమైన పదార్ధాలు

బరువు తగ్గడం అంత సులభమైన విషయంకాదు. పెరిగినంత తేలిగ్గా బరువు తగ్గలేం కానీ కొన్ని ఆహారపుటలవాట్లు మార్చుకుంటే బరువు తగ్గడం సులభతరం చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా మానేయవలసిన పదార్థం పంచదార. తీపి తినడం అంటే ఇష్టం ఉన్నవారు అంత త్వరగా మానలేకపోవచ్చు.కానీ తీపి పూర్తిగా మానేయమని కాదు. రిఫైన్డ్ టేబుల్ షుగర్ మానేసి దాని బదులు సహజంగా దొరికే తీపిని ఆహారంలో భాగం చేసుకోవాలి. మరింత సమాచారం కోసంం ఈ వీడియో చూడండి.

పంచదార అనారోగ్యకారకమే కాకుండా మత్తుపదార్థాల్లాగ బానిసలుగా మారిపోతాం. తీపి తిన్నప్పుడు మెదడు ఫీల్ గుడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. అందుకే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.అందుకే పంచదారను విడిచిపెట్టడం కష్టంగా ఉంటుంది. అనేక పండ్ల నుండి మనకు సహజంగానే షుగర్ లభిస్తుంది. ఈ షుగర్ మనకు ఎటువంటి చెడు చేయదు. ఎందుకంటే పండ్లలో షుగర్తో పాటు ఫైబర్, విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. పండ్లు తనలో ఉండే షుగర్ని శరీరంలోకి  నెమ్మదిగా విడుదల చేస్తాయి. పంచదార తయారుచేసేటప్పుడు ప్రోటీన్లు, విటమిన్లు ఏమీ ఉండవు.

 మామూలు పంచదార ఎక్కువగా వాడడం వలన బరువు బాగా పెరుగుతాం. అంతేకాకుండా ముఖంపై ముడతలు, డార్క్ సర్కిల్స్, మొటిమలు, పిప్పిపళ్ళు, చిగుళ్ల సమస్యలు, మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆరు పదార్థాలు పంచదార బదులు తీసుకుంటే ఆరోగ్యం గా ఉండడంతో పాటు తీపినికూడా ఆస్వాదించవచ్చు.

కోకోనట్ షుగర్ :– కొబ్బరి చెట్టు నుండి పెద్దగా రిఫైన్డ్ కాకుండా తయారు చేస్తారు. ఇది మామూలు పంచదార కంటే త్వరగా జీర్ణంకావడమే కాక ఇందులో ఐరన్, పొటాషియం, జింక్, కాల్షియం ఉంటాయి. కోకోనట్ షుగర్ గ్లైసమిన్ ఇండెక్స్ పంచదారతో పోల్చితే కేవలం ముప్పై ఐదు.

డేట్స్ షుగర్ :- ఖర్జూరం నుండి తయారు చేస్తారు. ఖర్జూరాలను వేయించి పొడి చేసి జల్లించి వాడుకోవచ్చు . లేదా మార్కెట్లో కొంచెం ధర ఉన్నా లభిస్తుంది. 

పటికబెల్లం:– మన దేశంలో పూర్వం పటికబెల్లాన్నే వాడేవారు. పంచదార తయారీలో కెమికల్ ఉపయోగించడానికి ముందే పటికబెల్లం తయారవుతుంది. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. పటికబెల్లం శరీరానికి చలువచేస్తుంది.

తేనె :- తేనెను తీసుకోవడం వలన శరీరం  దానిలోని పోషకాలను పూర్తిగా సంగ్రహిస్తుంది. ఎలాంటి పదార్థం తో అయినా తేనెను కలిపి తీసుకుంటే త్వరగా జీర్ణమవుతుంది.

స్టీవియా (స్వీట్ తులసి) :- స్వీట్ తులసి సహజంగా తియ్యగా ఉండి జీరో కేలరీలను కలిగి ఉండే మొక్క ఆకులు. అతి తక్కువ ధరలో స్టీవియా లభిస్తుంది. హెల్తీ ఆల్టర్నేటివ్ పేరుతో మనం తీసుకునేవి తయారుచేసినవే. 

బెల్లంలేదా బెల్లం పౌడర్ :-  బెల్లాన్ని కూడా చెరుకురసంతోనే చేసినా దీనిలో ఎందులోనూ లేనటువంటి న్యూట్రియంట్స్ ఉంటాయి. బెల్లంలోని పోషకాలు అధికం. రక్తాన్ని శుద్దీచేయడంలో అద్బుతంగా పనిచేస్తుంది. మలబద్దకం తగ్గించి, మెలబాలిజం పెంచి, లివర్నీ డీటాక్సిఫికేషన్ చేస్తోంది. చర్మ సమస్యలు ఉన్నవారికి బెల్లం లేదా బెల్లం పౌడర్ బాగా పనిచేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!