Healthy andTasty Flaxseed Podi recipe

ఇలా చేసి రోజుకు ముద్ద తిన్నా చాలు అందంగా ఇంకా ఆరోగ్యంగా తయారవుతారు

జుట్టు రాలడం తగ్గాలంటే జుట్టు ఆరోగ్యంగా పెరగాలన్నా, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, హై బీపీ, షుగర్, గుండె సమస్యలు ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల జబ్బులను నయం చేయడానికి అవిసె గింజలు  బాగా సహాయపడతాయి.  ఆ అవిసగింజల తో కారం పొడి చేసుకొని ఒక ముద్ద తిన్నా చాలు  ఎన్నో   ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.  ఈ కారంపొడి చాలా రుచిగా ఉంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఈ కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక  కప్పు అవిస గింజలను దోరగా  లో ఫ్లేమ్ లో  వేయించుకోవాలి. అవి  ప్లేట్ లోకి తీసుకొని కప్పు వేరుశనగలు తీసుకుని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. వేరుశనగ కూడా  ప్లేట్లోకి తీసి పావు కప్పు మినప్పప్పు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.

మినప్పప్పు లోనే పావు కప్పు నువ్వులు కూడా వేసుకుని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. వీటిని ప్లేటులోకి తీసి పావు కప్పు ధనియాలు వేసి కొంచెం వేయించి రెండు టేబుల్ స్పూన్ల  రియల్ కూడా వేయించుకోవాలి వీటిని ప్లేట్లోకి  తీసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర,  అరచెంచా మెంతులు వేసి కొంచెం వేయించుకోవాలి. ఒక కప్ కరివేపాకు కూడా  క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.

వీటన్నిటిని కొంచం  చల్లార్చుకొని కొంచెం చింతపండు కొంచెం ఉప్పు కలిపి  మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పెద్ద సైజు అయితే ఒక  వెల్లుల్లి పాయ చిన్నవైతే  రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి పేస్ట్  కారం పొడిలో వేసి బాగా కలుపుకోవాలి.టేస్ట్ చూసి ఉప్పు చాలకపోతే కొంచెం సాల్ట్ కలుపుకోవాలి.  దినేదినే ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెడితే రెండు నెలలు వరకు నిల్వ ఉంటుంది. బయట  ఉంచినట్లయితే ఒక నెల వరకు నిల్వ ఉంటుంది.

కారం పొడి చేసేటప్పుడు  నూనె అసలు వాడలేదు. కాబట్టి వేడి వేడి అన్నం లో కొంచెం కారం పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.ఈ కారంపొడి తో ఒక ముద్ద తిన్నా చాలా రుచిగా ఉంటుంది.  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. గుండెజబ్బులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం జుట్టు రాలడం  వంటి సమస్యలను తగ్గిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!