Healthy Sweet Recipe at Home Strength

మహా బలమైన పునుగులు ! వీటిని తింటే మీరు కలలు కనే ఆరోగ్యం మీ సొంతం…

 స్వీట్ ఐటమ్ లో కూడా ఆరోగ్యకరంగా తయారు చేసుకునే విధానం ఉంటుంది. పునుగులు అయితే నూనెలో వేసి వండుతాం ఇవి నూనె కారుతూ ఉంటాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే పునుకులు నూనె లేకుండా చేయడం అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే కొబ్బరి పాలను తీసుకుని ఆ పాలల్లో ఈ పునుగులను వేసి టేస్టీగా చేసుకునే విధానం చూద్దాం. కొబ్బరి పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి హెల్త్ పునుగులు ఎలా చేయాలో తెలుసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. పాల పునుగులు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పాలు ఒక లీటర్, మినప్పప్పు అర కప్పు, ఖర్జూర పొడి అర కప్పు తీసుకోవాలి.

              బియ్యప్పిండి రెండు టేబుల్ స్పూన్లు, పిస్తా పప్పు వన్ టేబుల్ స్పూన్, మేఘన వన్ టేబుల్ స్పూన్ వంటసోడా కొద్దిగా, యాలకుల పొడి కొద్దిగా. ముందుగా మిక్సీ జార్ లో మినపప్పు వేసి గారెలు పిండివలే గట్టిగా రుబ్బుకోవాలి. ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని దీనికి 2 టేబుల్ స్పూన్ బియ్యప్పిండిని కలుపుకోవాలి. గుల్లగా రావడం కోసం వంటసోడాకొద్దిగా కలిపితే పునుగులు మెత్తగా వస్తాయి. ఇలా వీటిని కలిపి సిద్ధం చేసుకుంటారు. నాన్ స్టిక్ కుంటల పాత్ర తీసుకుని పొయ్యి మీద పెట్టి స్సిమ్ లో ఉంచి. ఆ గుంటలన్నింటిలోనూ మీగడ రాసిసిన తర్వాత పునుగులను చిన్నచిన్నగా దానిలో వేయాలి.

                ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఆగిన తర్వాత వాటిని బాగా రెండోవైపు కాల్చుకోవాలి. అలా పునుగులను సిద్ధం చేసుకున్న తర్వాత పాలను కూడా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాత్ర పెట్టి దానిలో లీటర్ పాలు పోసి మరిగించాలి తరువాత దీనిలో ఎండు ఖర్జూరపు పొడిని కలపాలి. ఇది పంచదార వేసినంత  తీపి ఉంటుంది. కాబట్టి న్యాచురల్ గా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత యళికుల  పొడి వేసి పాలు సిద్ధం చేసుకోవాలి. తరువాత పునుగులను తీసుకొచ్చి పాలల్లో వేసేయాలి. ఇక చివరిగా పిస్తా పప్పును దానిపై చల్లుకుని సర్వ్ చేసుకుంటాం. రకరకాల పిండి వంటలు పూర్వ రోజుల్లో లేనప్పుడు ఇలాంటి వంటలని చేసుకుని తినేవారు.

               కాబట్టి పూర్వ రోజుల్లో చేసుకునేవి మళ్లీ ఈ రోజుల్లో ఫేమస్ అవుతున్నాయి కాబట్టి తప్పనిసరిగాయి ఈ పాల పునుగులను ఇంట్లో చేసుకునే తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Leave a Comment

error: Content is protected !!