ప్రస్తుత కాలంలో అధిక బరువు, శరీరంలో కొవ్వు పేరుకోవడం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో ప్రతి 100మందిలో 70% మంది బాధపడుతున్నారు. ఈ సమస్యల వలన రక్తనాళాల్లో కూడా కొవ్వు పేరుకుపోయి రక్త సరఫరాకు ఆటంకం కలిగిస్తాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మనం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాము. ఇంగ్లీష్ మందులు ఉపయోగించడం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి.
ఇంగ్లీష్ మందులు ఉపయోగించకుండానే నాచురల్ చిట్కాల ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ డ్రింక్ తయారుచేసుకొని పదిరోజులపాటు తాగినట్లయితే మూసుకుపోయిన నరాలు తెరుచుకుని రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని కోసం మనము ఒక యాపిల్ తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
దీనిలో రెండు వెల్లుల్లి రెబ్బలు, రెండు లవంగాలు, ఒక అంగుళం అల్లం ముక్క, అర చెక్క నిమ్మరసం వేసి టీ గ్లాస్ తో ఒక గ్లాసు నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని ఒక గ్లాసు లో వేసుకొని పావు చెంచా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇది ప్రతి రోజు ఉదయాన్నే టిఫిన్ చేయడానికి అరగంట ముందు లేదా రాత్రి పడుకునే ముందు కానీ పది రోజుల పాటు తాగినట్లయితే శరీరంలో అనేక అద్భుతాలు జరుగుతాయి. రక్తనాళాల్లో పేరుకున్న కొవ్వు కరుగుతుంది.
హార్ట్ బ్లాకేజ్స్, కరోనరి హార్ట్ డిసీజెస్ వంటివి రాకుండా ఉంటాయి. అల్లం మరియు వెల్లుల్లి ఉపయోగించడం వలన శరీరంలో అధిక కొవ్వును కరిగిస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలను కూడా తగ్గిస్తాయి. గ్యాస్ ట్రబుల్, అజీర్తి వంటి సమస్యలు తగ్గించడంలో కూడా చాలా బాగా సహాయపడతాయి. పసుపులో యాంటీబయటిక్ గుణం కలిగి ఉండటం వలన శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. లవంగాలు రక్తం సరఫరా బాగా జరిగేటట్లు, రక్తనాళాల్లో బ్లాకేజ్ తగ్గడానికి సహాయపడుతాయి.
శరీరంలో కఫం, వాతం సమస్యలు తగ్గించడానికి కూడా అల్లం, వెల్లుల్లి, లవంగాలు ఉపయోగపడతాయి. దీనిని ఒక పది రోజులు ఉపయోగించినట్లయితే సరిపోతుంది. ఎక్కువ రోజులు ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. ఒక సారి ఉపయోగించినట్లయితే తేడాని మీరే గమనిస్తారు. ఈ చిట్కా మీకు కూడా అవసరం అనిపిస్తే ఒక సారి ట్రై చేసి చూడండి. మంచి ఫలితం ఉంటుంది.