ప్రస్తుత కాలంలో అందరికీ గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారు గుండె జబ్బులతో బాధపడుతున్నారు. దీనికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, సరైన వ్యాయామం చేయకపోవడం దీనికి ప్రధాన కారణాలు. ప్రస్తుత కాలంలో నలభై యాభై ఏళ్లు వచ్చేసరికి గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారికి కూడా గుండె జబ్బులు వస్తున్నాయి.
ఇలాంటి గుండెజబ్బుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరైన ఆహార నియమాలు పెట్టుకోవాలి. శరీరానికి కావాల్సిన పోషకాలు మాత్రమే అందేలాగా ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజు శారీరక శ్రమ చాలా అవసరం. ఈ కషాయం తయారుచేసుకొని ప్రతిరోజు తాగినట్లయితే గుండె జబ్బులు రాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. దీనికోసం 6 నిమ్మకాయలు, 3 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి.
వెల్లుల్లి తొక్కలను తీసి నిమ్మకాయలు మరియు వెల్లుల్లిని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో రెండు లీటర్ల వరకు నీళ్లు పోసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని నీటిలో వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత గాజు సీసాలో వడకట్టుకొని మూత పెట్టి ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఉదయాన్నే పరగడుపున రోజుకి 50 ఎం.ఎల్ చొప్పున తీసుకోవాలి. ఈ డ్రింక్ వరుసగా మూడు వారాల పాటు తీసుకోవాలి.
తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్లీ మూడు రోజులపాటు తీసుకోవాలి. ఇలా ఆరు నెలలకు ఒకసారి చేయడం వల్ల శరీరంలో అధిక కొవ్వును తగ్గించి గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. నిమ్మరసం కూడా శరీరము బరువు కొవ్వు తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ డ్రింక్ తయారు చేసుకొని తాగడం వలన గుండె జబ్బుల నుండి రక్షించుకోవచ్చు. వీటితో పాటు సరైన ఆహార నియమాలు పాటించాలి.
ప్రతిరోజు వ్యాయామం కూడా చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే మీ శరీరంలో ఉండే అధిక కొవ్వు తగ్గుతుంది. దీనివలన బరువు కూడా తగ్గుతారు. మిమ్మల్ని మీరు గుండె జబ్బులు రాకుండా రక్షించుకోవాలి అనుకున్న వారు ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగండి. మంచి రిజల్ట్ ఉంటుంది.