herbal tea for throat infection

గొంతులో ఇన్ఫెక్షన్ కఫం,శ్లేష్మాన్ని పోగొట్టే హెర్బల్ టీ

ఊపిరితిత్తుల్లో కఫం చేరడం అనేది ఇది చాలా ఇబ్బంది పెట్టే సమస్య. దీని వలన దగ్గు, శ్వాస సమస్యలు ఏర్పడుతుంటాయి. వీటిని నివారించడానికి అనేక మందులు వేసుకుంటూ ఉంటారు. వాటి వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్ మరింత ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా చాలామందికి టీలు, కాఫీలు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వలన కూడా ఊపిరితిత్తులకు కఫం చేరుతుంది. ఇలా ఎక్కువ కాలం కొనసాగితే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

 అందుకే టీలు మానేయాలి అనుకునేవాళ్ళు, ఛాతిలో కఫం చేరి ఇబ్బంది పడేవాళ్లు ఈ చిట్కా పాటిస్తే మంచిది. దానికోసం మనకు కావలసిన పదార్థాలు ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి. మన ఇంటి వంట గదిలో ఉండే అనేక పదార్థాలు ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉన్నాయి. వీటి గురించి అవగాహన ఉంటే చిన్నచిన్న అనారోగ్యాలకు డాక్టర్ సహాయం లేకుండా చికిత్స పొందవచ్చు. 

టీలు కాఫీలో ఉండే చక్కెర కఫం, దగ్గు లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అంతే కాకుండా అధిక బరువు సమస్య కూడా చక్కెర కారణమవుతూ ఉంటుంది. అందుకే ఈ హెర్బల్ టీ తాగడం వలన టీ తాగాలి అనే కోరిక తీరుతుంది. హెల్త్ కూడా బాగుంటుంది. దానికి కావలసిన పదార్థాలు ఓ గ్లాసు నీళ్ళు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు లేదా యాలకుల గింజలు, 10 వరకు తులసి ఆకులు.

 ఇవన్నీ వేసి నీటిని బాగా మరిగించాలి. వీటి రసం నీటిలో దిగిన తరువాత స్టవ్ ఆపేసి నీటిని వడకట్టాలి. కొన్ని తేనె చుక్కలు వేసుకొని తాగవచ్చు. కొంత మంది నిమ్మరసం వాసనను ఇష్టపడతారు. అలాంటివారు కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఇది సహజ రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు గొంతునొప్పి, గొంతులో గరగర వంటి సమస్యలను నివారిస్తుంది. దీనిని టీ లా సిప్ చేస్తూ తాగితే మంచి ఫలితం ఉంటుంది.

 ఇందులో ఉండే పదార్థాలన్నీ  ఛాతిలో కఫంని తగ్గించడంతోపాటు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా నోరు చేదుగా ఉండే వ్యక్తులకు రుచిని ఇచ్చి నోరు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

Leave a Comment

error: Content is protected !!