Home Made Shampoo

మా సీక్రెట్ హోం మేడ్ షాంపూ…… గుప్పెడు కుంకుడుకాయలతో ఒక స్పూన్ ఇది కలిపి వాడండి….. జుట్టు పొడవుగా మందంగా పెరుగుతుంది…..

                   మా సీక్రెట్ హోం మేడ్ షాంపూ….. గుప్పెడు కుంకుడు కాయలతో ఒక స్పూన్ ఇది కలిపి వాడండి…….. జుట్టు పొడవుగా మందంగా పెరుగుతుంది…….

                      మనం బయట తెచ్చుకున్న షాంపులు ఎన్ని రకాలు అయిన, మైల్డ్ షాంపూలు అయినా వాటిలో ఉండే కెమికల్స్ వలన మన జుట్టు రాలే సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం కనిపించడం లేదు. దీని కారణంగా పల్చగా ఉంటుంది. ఎంత ఖరీదైన షాంపూలు అయినా ప్రతి షాంపులో హానికరమైన కెమికల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కనుక మనం ఇంటిలో నాచురల్ గా తయారు చేస్తున్న షాంపు ఉపయోగిస్తే ఎటువంటి కెమికల్ ఎఫెక్ట్ మన జుట్టుకు ఉండదు. ఇది హోం మేడ్ గనుక చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు.

                          ఈ హోం మేడ్ షాంపూ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మన జుట్టుకు సరిపడినంత కుంకుడుకాయలను తీసుకోవాలి. కుంకుడు కాయలు విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీని వలన మన జుట్టు డ్రై అయిపోదు. తర్వాత మనకు కావాల్సింది శీకాకాయ. ఇవి కుంకుడుకాయలకు సగం మోతాదులో తీసుకోవాలి. శీకాకాయలో ప్రోటీన్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో అమైనో ఆమ్లాలు ఉంటాయి‌. ఈ జుట్టుకి షైనీ అండ్ స్మూత్ నెస్ తీసుకొస్తాయి.

                     తర్వాత మనకు కావలసింది 2 టేబుల్ స్పూన్స్ ఉసిరి ఎండు ముక్కలు. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు కుదురుల నుంచి స్ట్రాంగ్ కావడానికి సహాయపడుతుంది. మరియు హెయిర్ గ్రోత్ కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది 1 టేబుల్ స్పూన్ మెంతులు. వీటిని డాక్టర్ ఆఫ్ హెయిర్ గా పిలుస్తారు. ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కలోంజి విత్తనాలు వేసుకోవాలి. ఇవి మన జుట్టును నల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు నీటిని పోసుకోవాలి. 

            కుదిరితే మందార ఆకులు లేదా పువ్వులను వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టి బాగా మరగనివ్వాలి. ఇలా 20-30 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని చల్లారనిచ్చి అందులో ఉన్న కుంకుడుకాయలను మిగిలిన మిశ్రమాలను చేతితో బాగా పిస్కాలి. ఇలా చేయడం ద్వారా అందులో ఉన్న రసం ఆ నీటిలోకి దిగుతుంది. ఇలా చేసిన మిశ్రమాన్ని పిప్పి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని మనం తల స్నానం చేసే షాంపూ గా ఉపయోగించుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు ఈ షాంపుతో స్నానం చేయాలి….

Leave a Comment

error: Content is protected !!