Home Remedies with Mehandi

మగువలకు మహారాణి లాంటి ఆకు ఇది. దీనిని మరిచిపోతే ఎలా??

మన సాంప్రదాయంలో గోరింటాకుకి ప్రత్యేకమైన స్థానం ఉంది అమ్మాయిలకు అద్భుతమైన నేస్తం గోరింటాకు. ఐదోతనానికి ప్రతీక. ఆనందాలకు శుభ సూచిక, పెళ్లిళ్లకు, పండగలకు, ఫంక్షన్లకు, గోరింటాకు లేని చేతిని ఊహించుకోలేం. చేతులకు కాళ్ళకు రకరకాల డిజైన్లలో ఎర్రగా పండిన గోరింటాకును చూస్తే

మనసుకి ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుంది మనకి ఇంత ఆనందాన్నిచ్చే గోరింటాకుతో ఎన్నో ప్రయోజనాలు, మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి గోరింటాకు మనకి మన జీవితంలో చేసే మేలు తక్కువ ఎం కాదు. మన పూర్వీకులు పెద్దలు ఏర్పాటు చేసే ఏ పద్ధతి సాంప్రదాయం వేనకైనా  మన ఆరోగ్యాన్ని ఆయుష్షుని  కాపాడేలా ఎలాంటి  మందులు వాడకుండా మనకు దొరికే సాధారణ పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని మెరుగు పరిచే వారు.

◆గోరింటాకు ఉపయోగాలు చెప్పుకోవాలి అంటే ఎన్నెన్నో ఉన్నాయి. జుట్టుని కాపాడుకోవడానికి దీనిని మించిన అమృత ఔషధం లేదనే చెప్పాలి. గోరింటాకు ముద్దగా చేసి తలకు పట్టించడం వల్ల తలలో ఉన్న వేడి తగ్గుతుంది చలవ చేస్తుంది. 

◆మన శరీరంలో మెలనిన్ అనే పదార్థం లోపించడం వల్ల ఏర్పడే తెల్ల జుట్టు నివారణకు గోరింటాకు వారానికి ఒకసారైనా తల కుదుళ్లకు బాగా పట్టించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. పిచ్చి పిచ్చి  రంగులు వేసుకుని తెల్ల జుట్టుని నల్లగా చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది. ఆ రంగులు డై ల వల్ల జుట్టు మరింత ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే రంగు వద్దు హెన్నా ముద్దు.

◆ఏమైనా గాయాలు అయిన చోట గోరింటాకు ముద్దను పట్టిస్తే ఆ గాయాలు ఇట్టే  మానిపోతాయి. కాలిన మచ్చలు ఉన్న గోరింటాకు ముద్ద  పెట్టడం వల్ల మటు మాయమైపోతాయి. కొంతమందికి గోళ్ళు బలహీనంగా ఉంటాయి. ఊరికే విరిగిపోతుంటాయి. గొర్ల మీద తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి  కొన్ని విటమిన్ల లోపాల వల్ల గొరుచుట్లు వస్తూ ఉంటాయి.

◆ఇలాంటి వాటి అన్నింటికీ అద్భుతమైన ఔషధం గోరింటాకు. పదే పదే గోర్లకి గోరింటాకు పేట్టడం వల్ల  దృఢంగా మారుతాయి. 

◆ఒక్కోసారి అరి కాళ్ళు విపరీతంగా మండుతూ ఉంటాయి. కొన్ని సీజన్లలో దురదలు పగుళ్లు కూడా మామూలే కాళ్ళకి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు గోరింటాకును మెత్తగా పేస్ట్ లా చేసి అక్కడ పట్టిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులకు కూడా గోరింటాకు పేస్ట్ బాగా పనిచేస్తుంది.

◆ గోరింటాకు గింజలు బెరడుతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి.  ఇప్పుడు వచ్చే కోన్ వాడేకంటే అప్పటికప్పుడు గోరింటాకు తెచ్చుకునీ రుబ్బి ఉపయోగించే దానిలో ఎక్కువ ప్రయోజనాలు సత్వర ఉపశమనాలు ఉంటాయి. కాబట్టి శుభప్రదమైన గోరింటాకును ఉపయోగిద్దాం.

చివరగా…..

విరివిగా దొరికే గోరింటాకు వల్ల ఇన్ని ఉపయోగాలా అనిపిస్తుంది కదా.. ఇప్పటివరకు మీరు ప్రయత్నించి ఉండకపోతే తప్పకుండా ప్రయత్నించండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 

Leave a Comment

error: Content is protected !!