స్త్రీలలో అధికంగా కనిపించే సమస్య తెల్లబట్ట (వైట్ డిశ్చార్జ్). మెచ్యూర్ అయిన అమ్మాయి దగ్గర నుంచి మెనోపాజ్ వచ్చిన పెద్దవారి వరకూ ఈ సమస్య ఉంటుంది. ఈ డిశ్చార్జ్ వలన ఎటువంటి దురద, మంట వాసన లేకపోతే ఎటువంటి సమస్య. ఉండదు. ఈ డిశ్చార్జ్ అనేది పసుపు, ఆకుపచ్చ, ముదురు రంగులో కనిపిస్తే అదీ దురద దుర్వాసన కలిగి ఉంటే మీరు తప్పకుండా దీనిని ఇన్పెక్షన్ లా భావించాలి.
చాలామంది దీనిని పెద్ద సమస్య గా భావించారు. దానివలన సమస్య ఇంకా పెద్దదవుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఈ సమస్య పెద్దదయితే పెల్విక్ ఏరియాలో నొప్పి వస్తుంది. పొట్ట కింది భాగంలో వాపులు, హార్మోనల్ ఇన్బాలన్స్ వస్తుంది. మీ వెజీనా ప్రాంతంలో ఇన్పెక్షన్, ప్రాణాంతకమైన కాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
అందుకే ఈ సమస్య ను చిన్నది అనుకోకుండా శ్రద్ధ తీసుకోవాలి. పెద్ద సమస్యల బారినపడకుండా చూసుకోవచ్చు. ఇలాంటి సమస్యలకు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలంటే మొహమాట పడుతుంటారు. డాక్టర్ దగ్గర చెప్పడానికి కూడా సిగ్గు పడతారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి ఈ ఇంటిచిట్కాలు అద్బుతంగా పనిచేస్తాయి. మొదటి కావలసింది ధనియాలు.
ధనియాలలో పొటాషియం, ఐరన్, విటమిన్ కె, సి అఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకవిలువలు పుష్కలంగా ఉంటాయి. ధనియాలు క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్ సి 30% లభిస్తుంది. ఇందులో ఐరన్ అధికంగా ఉండి స్త్రీల లో రక్తహీనత సమస్య తగ్గిస్తుంది. దీనికోసం ఏం చేయాలో చూద్దాం.
స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒకటి లేదా రెండు చెంచాల ధనియాలు వేసి మరిగించాలి. ఈ నీరు రంగుమారేలా పదినిమిషాలు మరిగించాలి. ఈ నీటిని తాగడంవలన గ్యాస్ సమస్య తొలగడంతో పాటు మన శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే లైంగిక శక్తిని పెంచుతుంది. రక్తపోటు, గ్లూకోజ్ లెవల్స్ అదుపులో ఉండడానికి సహాయపడుతుంది.
మరిగాక స్టవ్ ఆపేసి ఈ నీటిని గోరువెచ్చగా తీసుకోవాలి. ప్రతీరోజూ రెండు సార్లయినా తాగాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగాలి. పరగడుపున తాగడం వలన మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇది తాగడం మొదలు పెట్టిన మూడురోజుల్లోనే శరీరంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ నీటిని తాగడంవలన తెల్లబట్ట తగ్గడమే కాకుండా దురద వాసన కూడా తగ్గిపోతాయి.