మా అమ్మమ్మలు 50 ఏళ్ళలో కూడా లావుపాటి, నిగనిగలాడే మరియు నల్లటి జుట్టును ఎలా కలిగి ఉన్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రహస్యం శక్తివంతమైన ఆయుర్వేద గుణాలు ఉన్న అప్పటి కుంకుండు,సీకాకాయ వంటి జుట్టును శుభ్రపరిచే విధానం వలన జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండేవి. ఇప్పుడు మనం వాడుతున్న షాంపూలు అన్నీ పూర్తిగా కెమికల్స్ తో నిండి ఉంటున్నాయి. ఇవి మన జుట్టుకు చేసే మేలుకంటే హాని ఎక్కువగా ఉంటుంది. ఈ షాంపూల వలన జుట్టుకు హాని జరగకుండా, జుట్టును ధృడంగా చేసే పద్థతులు ఉన్నాయి.
వాటికోసం షాంపూలో కొన్న పదార్థాలు కలిపి వాడడం వలన జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. దీనికోసం ఒక శుభ్రమైన గిన్నె తీసుకుని అందులో కావలసినంత మీరు వాడే షాంపూ తీసుకోండి. ఇందులో ఒక హాప్ స్పూన్ టీపొడి కలపండి. టీపొడి జుట్టు కుదుళ్ళను బలంగా చేయడంలో సహాయపడుతుంది. జుట్టు రాలకుండా అరికడుతుంది. దెబ్బతిన్న జుట్టు రిపేర్ చేయడంలో దోహదపడుతుంది.
అలాగే ఇందులో కలపవలసింది ఉసిరి పొడి. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఉసిరి ప్రాచీన కాలం నుండి జుట్టు సంరక్షణ పద్థతులలో ముఖ్యమైన భాగంగా ఉపయోగించబడింది మరియు ఇది జుట్టుకు అమృతంగా పరిగణించబడుతుంది. విటమిన్స్ సి మరియు టానిన్స్ వంటి పోషకాలతో సమృద్ధిగా ఉన్నందున, ఆమ్లా శతాబ్దాలుగా బామ్మలకాలం యొక్క అందం ఖజానాలో భాగం.
తర్వాత కలపవలసింది కలబంద జ్యూస్. దీనిని ఒక స్పూన్ కలపడం వలన జుట్టు సమస్యలు తగ్గించడంలో దోహదపడి జుట్టు మెరిసేలా చేస్తుంది. ఇలా ఈ పదార్థాలు కలిపిన షాంపూని తలకు పట్టించి చక్కగా మసాజ్ చేయాలి. తర్వాత పది నిమిషాలు లోపు తలస్నానం చేయాలి. ఎక్కువ సేపు తలపై ఉండకూడదు. తలస్నానానికి ఎప్పుడూ వేడినీటిని ఉపయోగించకూడదు.
గోరువెచ్చని లేదా చల్లటి నీటిని వాడాలి. తరుచూ తలస్నానం చేయరాదు. వారానికి రెండు మూడు సార్లకు పరిమితము చేయాలి. తరుచూ తలస్నానం చేయడంవలన తలలోని సహజనూనెలు కూడా పోతాయి. ఇలా చేయడం వలన జుట్టు సమస్యలు తగ్గి ఒత్తెన బలంగా ఉన్న జుట్టు మీ సొంతమవుతుంది.