Homemade Pack for Tanned Skin Get Fair and Smooth Skin

సినీ తారల స్కిన్ గ్లో సీక్రెట్……… చర్మం పై ఉన్న నలుపు పోయి చర్మం నునుపుగా, మెరుస్తూ ఉంటుంది……

వాతావరణం లో ఉన్న పొల్యూషన్ కారణంగా లేదా ఎక్కువగా ఎండలో పనిచేసే వారికి మన శరీరంపై ఎండ పడే ప్రదేశంలో అంతా నలుపుగా తయారవుతుంది. దీన్ని సన్ టాన్ కూడా అంటారు. అంతేకాకుండా చర్మం పై ఉన్న డెడ్ సెల్స్ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి చర్మం నల్లగా తయారవుతుంది. ఈ సన్ టాన్ తొలగించుకోవడానికి పార్లర్ చుట్టూ తిరుగుతూ టాన్ క్రీం అని, బ్లీచ్ అని అనేకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ వస్తున్నారు. వాటి వలన స్కిన్ రెసస్ మరియు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటుంది. 

                                దీనితో పాటు ఎన్నో రకాల హోమ్ రెమెడీస్ ప్రయత్నించి ఫలితాలు లేక వదిలేసిన వారికి ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే రెమిడి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉపయోగించేవాన్ని మన వంటింట్లో లభించేవి కనుక ప్రతి ఒక్కరూ అనగా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. దీనికోసం ముందుగా మనకు కావాల్సింది ఓట్స్. ప్రస్తుత కాలంలో డైట్ పాటించే ప్రతి ఒక్కరు ఇంట్లో ఓట్స్ అనేవి ముఖ్యంగా ఉంటున్నాయి.

                     ఇవి బరువు తగ్గించడానికి ఉపయోగించడంతో పాటు, చర్మ సౌందర్యానికి బాహ్యంగా కూడా ఉపయోగించవచ్చు. ముందుగా ఒక కప్పు ఓట్స్ను మజ్జిగలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఓట్స్ కు తేనె మరియు అవసరమైతే పెరుగును కూడా కలుపుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని మన ముఖానికి మరియు శరీరంలో నల్లగా ఉన్న ప్రదేశంలో ప్రతి చోట అప్లై చేసుకోవాలి. ఓట్స్ పలుకులుగా ఉండడం వలన మంచి స్క్రబ్బింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ మనం చర్మంలో ఉన్న మృతకణాలు తొలగించడంలో సహాయపడతాయి.   

                            అంతేకాకుండా ఇందులో ఉపయోగించే పెరుగు మరియు తేనే మంచి న్యాచురల్ క్లీనర్స్ గా పనిచేసి చర్మాన్ని శుభ్రం చేయడంలో బాగా సహాయపడతాయి. అంతేకాకుండా ముఖం యొక్క తేజస్సును పెంచి చర్మంపై ఉన్న నల్లటి మచ్చలను తొలగిస్తుంది. సన్ టాన్ కూడా క్లియర్ చేస్తుంది. కనుక ఇలాంటి మన ఇంట్లోనే లభించే సహజ సిద్దమైన ప్రకృతి అందించే వాటిని ఉపయోగించడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా మంచి ఫలితాలను కూడా అందిస్తాయి…

Leave a Comment

error: Content is protected !!