సెల్ ఫోన్… ఈ రెండు అక్షరాలు మనుషులని కలపడమే కాదు… చాలా మంది ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా నేటి ఆధునిక యుగంలో చిన్నపిల్లలు సెల్ ఫోన్ లకు బానిసలవుతున్నారు. స్కూల్ నుంచి వచ్చేది మొదలు, చిన్నపిల్లల నుంచి టెన్త్… ఆపై చదువుతున్న పిల్లలు సెల్ ఫోన్ లకు అత్తుక్కు పోతున్నారు. వారి తల్లిదండ్రులు ఒకటికి రెండు సార్లు గట్టిగా మందలిస్తే, ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలు కూడా మనం వింటూనే ఉన్నాము.
దుష్ప్రభావాలు…
ఇక… సెల్ ఫోన్ నుంచి వచ్చే దుష్ప్రభావాలు అన్ని ఇన్ని కాదు. చూపు మందగించడం మొదలుకొని… ఊబకాయం, బుద్ధి మందగించడం, మానసిక సమస్యలు ఎదుర్కోవడం, కోపం పెరుగుదల, ఇలా చాలా వాటికి గురవుతున్నారు. అదే సమయంలో, తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల అశ్రద్ధ చూపించడంతో ఈ పరిస్థితి మరింత ముదిరింది.

టీన్ ఏజ్ పిల్లల్లో…. అప్పటి వరకు టాప్ మార్కులు వచ్చే పిల్లలు ఒక్కసారిగా చదువులో వెనుకబడుతుంటారు. దీనికి కారణం తెలియక వారి తల్లిదండ్రులు సతమతమవుతుంటారు. మరి దీనికి కారణం? ప్రైవసీ అంటూ సెల్ ఫోన్ లను వారి బెడ్ రూమ్ లకు పట్టుకుపోవడం, శరీరమార్పుల కారణంగా వచ్చే ఆలోచనలతో అశ్లీల సైట్ల బారిన పడడం, డేటింగ్ సైట్ లకు ఆకర్షితులు అవ్వడం ముఖ్య కారణం.
- దీని ముందు ఖరీదైన ఫేషియల్ కానీ ఫేస్ ప్యాక్ కానీ పనిచేయదు
- రాత్రి పూట ఇలా చేస్తే వద్దన్నా మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది
సెల్ ఫోన్ ఆడుతూ బాహ్యప్రపంచం నుంచి దూరంగా గడుపుతూ… చివరికి మనిషి ఎదుగుదలకు ఎంతో ముఖ్యమైన మానవ సంబంధాలను కూడా పిల్లలు విస్మరిస్తున్నారు. ఒకప్పుడు, చుట్టుపక్కల ఇళ్ళ పిల్లలతో ఆడుతూ కనిపించే పిల్లలు… ఈరోజుల్లో వారి రూమ్ లకు మాత్రమే పరిమితం అవుతున్నారనడం లో ఎటువంటి సంకోచం లేదు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
ఇటువంటి సందర్భంలో… తల్లితండ్రులు ఎంతో జాగ్రత్తగా… సున్నితంగా వ్యవహరించాలి. ఒక్కసారిగా సెల్ ఫోన్ లాక్కోవడం లాంటివి చేస్తే పిల్లలు విపరీత చర్యలకు పాల్పడవచ్చు. వారిని ముందుగా ఒక మంచి మానసిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళి, వారి మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. అదే సమయంలో, ఇంట్లో కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూసుకుంటూ, పిల్లలతో వీలైనంత సమయం గడపాలి. ముఖ్యంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తరువాత, వారితో ఒక గంట సేపైనా గడపాలి.
పిల్లలు సుఖంగా ఉండాలని ఒక గంట ఎక్కువ కష్టపడే తల్లిదండ్రులు, ఆ గంటను పిల్లలకోసం వెచ్చిస్తే… వారు మరింత సంతోషంగా ఉంటారు, సరైన నడవికతతో నడుచుకుంటారు.