how many days vaccine will work

అస్సలు వ్యాక్సిన్ ఎన్ని రోజులు పనిచేస్తుంది – Dr Mukarjiii

క*రోనా వాక్సిన్ తీసుకున్న తర్వాత ఎంత కాలం పని చేస్తుంది అనేది చాలామంది అడుగుతున్నారు. మళ్ళీ ఇంకొకసారి ఎంతకాలం తర్వాత వరకూ వ్యాధి రాకుండా ఉంటుంది. వాక్సిన్ తీసుకున్న తర్వాత ఎంతకాలం వ్యాధి రాకుండా ఉంటుంది అనేది ముందుగా వ్యాధి సోకి తగ్గిపోయిన తర్వాత జరిగిన పరిశోధనలో వ్యాధి తగ్గిపోయిన తర్వాత ఏడు నుండి ఎనిమిది నెలల వరకు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంది. ఏడెనిమిది నెలల వరకు కూడా యాంటీబాడీస్ బాడీలో ఉండే అవకాశం ఉన్నప్పుడు వారికి కొంత మేరకు ప్రొటెక్షన్ కూడా ఉండే అవకాశం ఉంది. వ్యాధి వచ్చిన 88 శాతం మందికి వచ్చే అవకాశం ఉండదు. 

మిగతా పది పన్నెండు శాతం మందికి మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తరహా ప్రశ్నలపై ప్రయోగాలు ఎక్కువగా జరిగింది కాబట్టి  దీంతో ఇలాంటి ప్రయోగాలు ఏంటంటే ఆరునెలలు వరకూ వ్యాధి బారిన పడినవాళ్లు  తర్వాత యాంటీబాడీస్ సమృద్ధిగా ఉండటంతో పాటుగా వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుందని తెలుస్తోంది. అదే విధమైన పరిశోధనలు కూడా వచ్చినాయి. వైరస్ ఆరు నెలల పాటు దూరంగా ఉండే అవకాశం ఉంది. కాని ఆరు నెలల తర్వాత సంగతి ఏంటి అంటే అది ఇంకా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సంవత్సరం చూసిన తర్వాత మనకు ఒక సంవత్సరం పాటు వచ్చే అవకాశం ఉందా లేదో తెలుస్తుంది. 

మనకి క్లారిటీ వచ్చే లోపలే mrna అనే వాక్సిన్ కనిపెట్టబడింది మొదట. దీంట్లో ఫైజర్,మెడర్నా వాక్సిన్ రెండు వాక్సిన్లు ప్రపంచం మొత్తం సరఫరాచేసారు. మెడర్నా వాక్సిన్ వేసినప్పుడు ఆరునెలల వరకూ వ్యొధి సోకే అవకాశంలేదని తేలింది. ఫైజర్ కంపేనీ ఓనర్ ఆల్బర్టో బోర్లా ఆయన ఒక ప్రకటన చేశారు..వాక్సిన్ వేసుకున్న తర్వాత ఆరు నెలల తర్వాత బూస్టర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే ప్రకటన చేశారు.  తీసుకోవాలా వద్దా అంటే ఇప్పడిదాకా ఆరు నుంచి ఏడు నెలల  తీపాటు పని చేస్తుంది అని ఉంది కదా మరి ఇంకెందుకు ఆరు నెలల తర్వాత తీసుకోవాలని చెప్పారు అంటే సరైన రుజువులు లేకుండానే ఆయన అలా చెప్పాడు. 

 ఆరు నెలలు లోపల కొత్త వేరియంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వేరియంట్  కొత్తది వస్తే ఎమ్మార్ అనే వ్యాక్సిన్లు కొద్దిగా మాడిఫైడ్ చేసుకుని మనం చేసినట్లయితే వాక్సిన్ ఇచ్చినట్లయితే మనకి అది పని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన ఆరు నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటిదాకా ప్రపంచంలో అలాంటి పరిశోధన ఏదీ  ఆరు నెలలు తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలి కచ్చితంగా అనేవిధంగా ఏమీ లేదు. ఇంకా కొంత కాలం గడిస్తే కనుక ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. కోవీషీల్డ్, కోవాక్సిన్ గురించి విస్తృతంగా ఫలితాలు రావలసిఉంది.  పరిశోధనలు చేస్తున్నారు అయితే ఎప్పటిదాకా ఇమ్యునిటీ  ఉంటుంది.

 కోవీషీల్డ్ తర్వాత అనే విషయంలో ఇంకా క్లారిటీ రాకపోగా కోవాక్సిన్ అయితే మూడో దశ ఫలితాలు కూడా ఇంకా రాలేదు. కోవాక్సిన్ కి ఇంటరన్  ఫలితాలు ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా ఇచ్చిన మధ్యంతర ఫలితాల్లో 81 శాతం ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పిన కోవాక్సిన్ రెండోసారి ఫలితాల్లో 78 శాతం వరకు పనిచేస్తుంది అని తెలిసింది.దీనిని భారత వైద్య ఆరోగ్య శాఖవారు  వెల్లడించారు పూర్తి ఫలితాలు జూన్ వరకు రావచ్చు. ఆస్ట్రజెనికా వాక్సిన్ ఫలితాలు ప్రకారం సుమారు ఆరునెలల వరకూ పనిచేస్తుంది అని తెలిసింది.  కాబట్టి రెండు వాక్సిన్లు కూడా రక్షణ ఎంతకాలం వుంటుంది అనేది మనకి తెలియదు.  ఏదేమైనప్పటికీ ప్లూలకోసం సంవత్సరానికి ఒక్కసారి వాక్సిన్ ఇస్తున్నట్టుగా ఈ విషయంలో కూడా మనం ఎంతో కొంత దూరంలో మళ్ళీ వేసుకోవాల్సిన అవకాశం ఉంది.  చాలా  ప్రస్తుతానికి మాత్రం ఆల్బర్ట్ బోర్లా గారు మనకి సిక్స్ మంత్స్ తర్వాత తీసుకోవాలి అని చెప్పిన దానికి మాత్రం ఎటువంటి ఆధారాలు లేవు

Leave a Comment

error: Content is protected !!