How to Clean Arteries at Home Avoid Heart Attack

గట్టిగా పట్టేసిన ఫ్యాట్ ని కూడా తీసేసే డైనమిక్ డోస్

వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి  రక్తనాళాల బ్లాకేజ్  వస్తున్నాయి.  బ్లాకేజ్ వలన పక్షవాతం, హార్ట్ ఎటాక్ వంటి  ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం  వలన రక్తనాళాల బ్లాకేజ్ అనే సమస్య వస్తుంది. తీసుకునే ఆహారంలో ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వలన రక్తనాళాల బ్లాకేజ్ జరుగుతుంది. 

 కూల్ డ్రింక్స్,ఐస్ క్రీమ్స్ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు ఎక్కువ అవుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం  రక్త ప్రసరణ ఆగిపోతుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం  ఉంది. గుండెకు కొవ్వు పేరుకోవడం వల్ల హార్ట్ ఎటాక్, మెదడుకు కొవ్వు పేరుకోవడం వలన పక్షవాతం వస్తాయి.  కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ లో ఉండే రసాయనిక పదార్ధాలు రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తాయి. దీనివల్ల కొవ్వు రక్తనాళలలో ఎక్కడికక్కడ అంటిపెట్టుకుని ఉండిపోతుంది.

చెడు కొలెస్ట్రాల్  రక్తం లో చేరి రక్తనాళాలలో  బ్లాకేజ్  ఏర్పరుస్తుంది.  మంచి కొలెస్ట్రాల్ రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. యాంటి ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్  నైట్రిక్ ఆక్సైడ్  రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల  మంచి   కొలెస్ట్రాల్ పెరుగుతుంది. నేరేడు, రేగు పళ్ళు, బత్తాయి, కమలం వంటి  సిట్రస్ ఫుడ్స్  తీసుకోవడం వల్ల  యాంటీఆక్సిడెంట్స్ పెరుగుతాయి.

దీనివల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది వెల్లుల్లి, ఉల్లిపాయ, బీట్రూట్, పాలకూర, క్యాబేజీ వంటి ఆహారం  తీసుకోవడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా అందుతాయి. దీని వల్ల రక్తనాళాలు బ్లాకేజెస్ తగ్గించవచ్చు. ఆకుకూరలు, ఫ్రూట్స్  ఎక్కువగా తీసుకోవాలి   ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్  ఎక్కువగా తీసుకోవాలి.  వాల్ నట్స్ కూడా హెచ్ డి  ఎల్ కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. 

ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బాదం, అవిస గింజలు కూడా   హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను పెంచడంలో బాగా సహాయపడుతాయి.  గింజలను  రాత్రి నానపెట్టుకొని ఉదయం, ఉదయం నానబెట్టి  సాయంత్రం తినాలి.  వీటితోపాటు పళ్ళు ఎక్కువగా తీసుకుని,స్ప్రౌట్స్ కూడా తినాలి.మద్యాహ్నం ఆకుకూరలను తీసుకోవాలి.

ఇలా చేయడం వలన HDL కొలెస్టెరాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.  నీతో పాటు సిట్రస్ ఫుడ్స్ సీజనల్ ఫ్రూట్స్ తింటు  ఉండాలి.  నేచురల్ ఫుడ్ ఎంత ఎక్కువగా తింటే రక్త నాళాల్లో అంత త్వరగా బ్లాకేజెస్  తగ్గుతాయి. ఉడికించినవి, చీజ్, పంచదార, ఆయిల్ వంటివి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్  పెరుగుతుంది.  తెల్ల రవ్వ లేదా పిండులతో చేసిన ఆహారం ఎక్కువగా తీసుకున్నా  చెడు కొలెస్ట్రాల్  పెరిగిపోతుంది. వైట్ ఫుడ్స్, వైట్ రైస్ చెడు కొలెస్ట్రాల్  బాగా పెరిగేలా చేస్తాయి. వాటిని తగ్గించి నాచురల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

Leave a Comment

error: Content is protected !!