సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అలాగని మిగతా అవయవాలు ముఖ్యం కాదని అర్థంకాదు. శరీరంలో ప్రతి అవయవం ముఖ్యమైనదే. ఏ అవయవం తనపని సక్రమంగా చేయకపోయినా శరీరం మొత్తం వ్యవస్థ అస్థవ్యస్తం అయిపోతుంది. అలాగే అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే ఆహారం నుండి వచ్చే పోషకాలు అవసరం. తిన్న ఆహారం జీర్ణంచేసి విషపదార్థాలను వేరుచేసి శద్దమైన రక్తాన్ని శరీరానికి అందించే కిడ్నీలు కూడా శరీరంలో అతిముఖ్యమైన అవయవాలలో ఒకటి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి
కిడ్నీలలో ఉండే నెప్రాన్స్ అనే ప్యూరిపయర్స్ రక్తాన్ని వడకట్టి అందులో ఉండే పోషకాలను శరీరానికి, విష పదార్థాలు మూత్రంలోనికి పంపిస్తాయి. కిడ్నీలలో విషపదార్థాలు పెరిగిపోతే మొదట చర్మంపైన, జుట్టుపైన, శరీరంలోని ఇతర అవయవాల పైన ఆ ప్రభావం పడుతుంది. కిడ్నీలలో ఏర్పడే లోపంవలన మూత్ర సమస్యలు, శృంగారంలో అనాసక్తత ఏర్పడుతుంది. బయట దొరికే తిండిపదార్థాలు, ఎక్కువగా నూనెలో వేయించిన పదార్థాలు, నిల్వచేసిన పదార్థాలు తినే వారిలో కిడ్నీ సమస్యలు త్వరగా వస్తాయి.
మద్యం, పొగతాగడం, మసాలాలు కలిగి ఉన్న మాంసాహారం ఎక్కువగా తినడంవలన , చక్కెరతో నిండిన పదార్థాలు కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మందుల వాడకం, ప్రొటీన్లు అధికంగా తీసుకునే వారిలో క్రమంగా కిడ్నీల పనితీరు కుంటుపడుతుంది. అస్తవ్యస్తంగా ఉన్న తిండి అలవాట్లు, నిర్లక్ష్యం వలన కిడ్నీలు కొన్నివ్యాధులకు గురవుతాయి.
నెప్రైటీస్ అంటే కిడ్నీలలో వాపు, కిడ్నీలలో రాళ్ళు ఏర్పడడం, కణితులు ఏర్పడటం, క్రానిక్ కిడ్నీ వ్యాధులు, కిడ్నీలు పనిచేయకపోవడం లాంటివి జరుగుతాయి. మంచి జీవనవిధానం, ఆహారపుటలవాట్లు కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
వయసు పెరిగేకొద్దీ కిడ్నీల ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. వాటిలో పేరుకున్న టాక్సిన్లను తొలగించడానికి డీటాక్సిఫికేషన్ చెయ్యాలి. కిడ్నీల ఆరోగ్యం కోసం ఏం చెయ్యగలమో చూద్దాం. మొక్కజొన్న పొత్తుకి జుట్టులా ఉండే పీచుని తీసుకుని ఎండబెట్టాలి. ఎండిన తర్వాత నీటిలో వేసి మరగబెట్టి నిమ్మరసంతో టీలా తీసుకుంటే కిడ్నీలలోని విషపదార్థాలను, రాళ్ళను శుభ్రపరిచి మూత్రంలో బయటకు పంపిస్తుంది. దీనిలో ఉండే ఫైబర్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ దొరుకుతాయి.
నెలలో రెండుసార్లు, తినక ముందు లేదా తిన్నాక అరగంట తర్వాత తీసుకోవడం వలన కిడ్నీలు, బ్లాడర్ శుభ్రపడతాయి. పుచ్చకాయ ఎండువిత్తనాలు తీసుకుని పొడి చేసుకోవాలి. ఆ పొడిని నీటిలో వేసీ మరిగించి ఆ నీటిని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వలన కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ చిట్కాలతో శరీరానికి ఇంత అవసరమైన కిడ్నీల ఆరోగ్యం గురించి కూడా ఇకపై శ్రద్ద పెడదామా మరి.
I am getting pain right side in my kidney already iam checking doctor said no problem but iam getting pain still
Good advise, thanks for the given valueble advise