మనందరికీ ఉదయం పూట లేవగానే మంచినీళ్లు తాగితే చాలా మంచిదని తెలుసు. రెండున్నర మూడు లీటర్ల వరకు తాగుతాం. ఇలా తాగడం చాలా మందికి అలవాటు. ఇలా తాగే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమందికి నీరు తాగడం అనేది చాలా తక్కువ అలవాటుగా ఉంటుంది. వీరికి పొద్దున్నే నీరు తాగాలి అంటే వీకారం అనిపిస్తుంది. వీరు అసలు నీటిని చూస్తేనే ఇష్టపడరు. అలాంటివారు నీటిని తాగాలి అన్నప్పుడు జీరా వాటర్ తాగవచ్చు. కేరళలో ప్రస్తుత కాలం జీరా వాటర్ చాలా ఫేమస్. అక్కడ హోటల్, రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు నార్మల్ వాటర్ బదులు జీరా వాటర్ ని ఇస్తారు.
జీలకర్ర నీటిలో వేసి బాగా మరిగించి ఆ వాటర్ ని స్పెషల్ గా ఇస్తారు. జీలకర్ర ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది. అందువలన నార్మల్ వాటర్ తాగలేని వారు జీరా వాటర్ ను తాగవచ్చు. అటువంటి జీరా వాటర్ ను ఉదయం లీటర్ లేదా లీటన్నార తాగినప్పుడు ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా జీరా వాటర్ లో ఉండే థైమాల్ అనే కెమికల్ కాంపౌండ్ ముఖ్యంగా మన జీర్ణవ్యవస్థ బాగా ఆక్టివేట్ అవ్వడానికి కావలసిన ఎంజైమ్స్ అనగా లైపేజ్, ప్రోటీయెజ్, ఎమైలేజ్ వంటి ఎంజైమ్స్ ఉత్పత్తి బాగా అయ్యేటట్లు చేస్తుంది.
దీని ద్వారా పవర్ఫుల్ జీర్ణ ప్రక్రియ జరగడానికి, పోషకాలు ఒంటికి పట్టడానికి, గ్యాసెస్ ఫామ్ అవకుండా పేగుల్లో ఆహార పదార్థాలు కిందకు మూవ్ అవ్వడానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. అందువలన డైజెస్టివ్ స్టిమ్యూలేట్ లాగా జీలకర్ర లేదా జీరా వాటర్ ఉపయోగపడుతుంది. రెండవదిగా ఈ జీరా వాటర్ తాగడం వలన థైమో క్వీనోన్ అనే కెమికల్ కాంపౌండ్ ఇందులో ఉంటుంది. ఇది బాడీలో మెటబాలిక్ రేట్ పెంచి ఫ్యాట్ కరిగేటట్లు చేస్తుంది. బరువు తగ్గడానికి మెట్టబాలిక్ ఇంక్రీజ్ చేస్తే బెటర్ అని అనుకుంటారు.
జీరా వాటర్ దీనికి బాగా ఉపయోగపడుతుంది. అందువలన మనం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి రెండు బెనిఫిట్స్ మీరు పొందడానికి జీరా వాటర్ మీరు ఉదయం పూట త్రాగలిగితే మంచిది. ఎవరైనా నార్మల్ వాటర్ తాగలేనప్పుడు, నోరు బాగా లేని వారికి డైలీ జీరా వాటర్ తాగితే ఇటువంటి ఫలితాలు మనం పొందుకోవచ్చు