How to Cure Cavities Strong Teeth Naturally

రెండు నిమిషాల్లో, రెండు చిట్కాలతో పంటికి సంబంధించిన సమస్యల నుంచి పూర్ణ విరామం!!

ఈ మధ్య చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒకరిని దంత సమస్యలు పీడిస్తున్నాయి. పళ్ల మీద క్యావిటి పెరగటం, చిగుళ్ల నొప్పి, పళ్లు పుచ్చిపోవటం, చిగుళ్ళలో రక్తం రావడం, చల్లటి నీళ్ళు తాగిన, వేడి ఆహారం తీసుకున్న దంతాల్లో విపరీతంగా నొప్పిగా ఉండటం, కొన్ని సార్లు చెవి నుంచి తలదాక మొత్తం నొప్పిగా అనిపించడం, నోటి దుర్వాసన రావటం ఇలాంటి ఏన్నో సమస్యలను ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు ఎదురుకుంటూ ఉంటారు. 

అలాంటి సందర్భాల్లో నొప్పి తగ్గటం కోసం మనం డెంటిస్ట్ దగ్గరకు వెళ్తూ ఉంటాం లేదా కొద్దిపాటి నొప్పిగా ఉంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడి సరిపెట్టుకుంటాం కదా.! దానికి బదులుగా ఇంట్లోనే సహజమైన మార్గంలో సమస్య తగ్గించుకొనే అవకాశం ఉంటే..! ఈ రోజు మనం ఇంట్లోనే సులభంగా చేసుకొనే చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్ధాలు.

లవంగం, వెల్లుల్లి మరియు ఆముదం నూనె. 

-లవంగంలో యాంటీ ఇంఫ్లేమేటరీ గుణాలు ఉండటం వల్ల పెయిన్ కిల్లర్ గా సహాయపడుతుంది, పుచ్చిన పళ్ళలోని బ్యాక్టీరియాను నివారిస్తుంది, చిగుళ్ళను దృడ పరుచుతుంది.-వెల్లుల్లిలో కూడా యాంటీ ఇంఫ్లేమేటరీ లక్షణలు ఉండటం వల్ల.. చిగుళ్ళలో రక్తస్రావం తగ్గించి, క్యావిటి రాకుండా, మౌత్ అల్సర్ కూడా తగ్గిస్తుంది.  -ఆముదం నూనె నొప్పి తగ్గించి పుండు మానడానికి సహాయం చేస్తుంది.

తయారి చేసుకొనే విధానం-మొదటిగా చిన్న రోలులో లవంగాలు వేసి గరుకుగా పొడిలా చేసుకోండి, తర్వాత వెల్లుల్లి రెబ్బలను వేసి పేస్ట్ లాగా చేసుకొని మందపాటి గిన్నెలో ఆముదం నూనె వేడి చేసి అందులో వెల్లుల్లి, లవంగాల మిశ్రమం వేసి బాగా వేగించాలి. చల్లారిన నూనెను స్ట్రెయినర్ ద్వారా ఫిల్టర్ చేసి గాజు సీసాలో వేసి ఉంచండి. పైన చెప్పిన దంత సమస్యలు ఏదైనా ఉంటే ఈ నూనెను కాటన్ సహాయంతో సమస్య ఉన్న చోట రాసుకుంటే వెంటనే నొప్పి తగ్గుతుంది. ఉదయం పళ్లు తోమడానికి ముందు ఈ నూనెతో మసాజ్ చేసుకుంటే పళ్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. 


మరో సులభమైన విధానం చిన్న గిన్నెలో లవంగం నూనె కొంచెం వేడి చేసి అందులో వెల్లుల్లి రెబ్బలు వేగించుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసి, వెల్లుల్లి రెబ్బలతో పాటు పళ్ళ మీద మర్ధన చేయడం వల్ల పాచిబట్టిన పళ్లు తెల్లగా అవుతాయి మరియు క్యావిటి సమస్యల నుంచి విముక్తి దొరుకుతుంది.  

Leave a Comment

error: Content is protected !!