మన ఆహారపు అలవాట్లులో వస్తున్న మార్పుల వలన మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. వీటన్నిటికీ ముఖ్య కారణం ప్రేగుల్లో పేర్కొన్న మలినాలు బయటకు వెళ్లకపోవటమే. ఇవి శరీరంలో ఉండటం వలన రక్తంలో కలిసి అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంటాయి. వీటిని బయటకు పంపడానికి మలబద్ధకం అడ్డుపడుతూ ఉంటుంది. మనం పూర్తిగా బయటకు వెళ్లిపోతే శరీరం శుభ్రపడుతుంది. దాని వలన ఎటువంటి రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోయినా ప్రేగుల కదలికలు సరిగ్గా లేకపోయినా మలబద్దకం సమస్య ఏర్పడుతుంది.
మలబద్దకం తగ్గించుకోవడానికి మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు చాలా బాగా సహాయపడుతాయి. అవి సోంపు గింజలు. సోంపు గింజలు తిన్న ఆహారాన్ని బాగా జీర్ణం చేసి మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తొలగించేందుకు సహాయపడతాయి. వీటిలో ఉండే ఫైబర్ ఆహారం జీర్ణం అవ్వడానికి సహకరిస్తుంది. ఇప్పుడు ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక స్పూన్ సోంపు గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీళ్ళు రంగు మారేంతవరకూ ఉంచి తరువాత స్టవ్ ఆపి నీటిని వడకట్టుకోవాలి. ఈ నీటిలో ఇప్పుడు మనం కలపబోయేది ముఖ్యమైన పదార్థం. ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
అదే ఆముదం నూనె. ఆముదం కడుపులోని మలినాలను మలం ద్వారా బయటకు పంపించడంలో, సుఖ విరోచనం అయ్యేందుకు సహకరిస్తుంది. గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి. అందులో అర చెక్క నిమ్మరసం కూడా వేయాలి. నిమ్మరసం శరీరాన్ని డిటాక్సిఫై చేసేందుకు శరీరానికి కావాల్సిన విటమిన్ సి అందించేందుకు సహకరిస్తుంది. దీనిలో చిటికెడు నల్ల ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ బాగా కలిపి రోజూ పరగడుపున తాగాలి. రోజు మార్చి రోజు తాగడం వలన శరీరం శుభ్రపడి రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఉదయాన్నే లేచిన వెంటనే రెండు గ్లాసుల నీటిని తాగి ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉండగా తీసుకోవాలి.