పేలు సమస్య చిన్న పిల్లలకు పెద్దవారికి చాలా ఎక్కువగా ఉంటుంది. పేలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికోసం రకరకాల నూనెలు షాంపూలు వాడుతూ ఉంటారు. కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ మూడు చిట్కాలు ట్రై చేసినట్లయితే తలలో పేలు మొత్తం పోతాయి. మొదటి చిట్కా తలకి నూనె పెట్టి పేలు మొత్తం పోయేలాగా దువ్వుకోవాలి. ఇలా చేయడం వలన తలలో పేలు మొత్తం పోతాయి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల తలలో పేలు మొత్తం తగ్గిపోతాయి.
ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇలా ఒకేసారి చేయాలి. ఒక్కొక్కరు ఒక సారి చేయడం వల్ల ఒకరికి తగ్గినా ఇంకొకరి తలలో పేలు మళ్ళీ వీళ్ళకు వస్తాయి. పేలు సమస్య ఎక్కువగా ఉంటే రెండో చిట్కా ట్రై చేయండి. ఇవెర్మెక్టిన్ అనే టాబ్లెట్ ఉంటుంది.ఈ టాబ్లెట్ ఒకటి వేసుకుంటే చాలు తలలో పేలు మొత్తం చచ్చిపోతాయి. ఈ టాబ్లెట్ రాత్రి ఒకటి వేసుకుని పడుకుంటే చాలు ఉదయానికి పేలు మొత్తం కదలలేని స్థితిలోకి వస్తాయి. ఉదయాన్నే దువ్వడం వలన పేలు మొత్తం పడిపోతాయి.
ఇవి పేలుకి మాత్రమే పనిచేస్తుంది. వీపులకి పని చేయదు.వీపులు పెద్దవి అయ్యి పేలు అవ్వగానే మళ్ళీ ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు మూడు వారాల పాటు పేలు తగ్గేంతవరకు వారానికి ఒకసారి టాబ్లెట్ వేసుకోవడం వలన పేల సమస్య తగ్గుతుంది. ఈ టాబ్లెట్ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి వేసుకోవాలి. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒకసారి వేసుకుంటే ప్రయోజనం ఉండదు. ఒకరి నుండి ఇంకొకరికి వచ్చేసే అవకాశం ఉంటుంది.
మూడవ చిట్కా పెర్లైస్ అని లోషన్ ఉంటుంది. ఈ లోషన్ అప్లై చేసి ఒక అలా వదిలేసి తర్వాత తలస్నానం చేయాలి.తల స్నానం చేసిన తర్వాత తడి తడితలను దువ్వడం వలన పేలు మొత్తం పడిపోతాయి. ఇలా వారానికి ఒకసారి చేయడం వలన పేలు మొత్తం తగ్గిపోతాయి.ఈ మూడు చిట్కాలలో ఏ ఒక్కటి ట్రై చేసిన ఇంట్లో వాళ్ళందరూ ఒకేసారి ట్రై చేస్తేనే ఫలితం కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్లలో ఏ ఒకరైన తర్వాత చేయొచ్చు అనుకుంటే వీళ్ల తలలో పేలు తగ్గిన వారి తలలోకి వచ్చేస్తాయి. వారానికి గంట కేటాయించినట్లయితే పేల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.