మనదేశంలో చాలా ఎక్కువగా పెరుగుతున్న కేసులలో డయాబెటిస్, థైరాయిడ్ ముందు వరుసలో ఉంటున్నాయి. ఈ రెండు వ్యాధులు శరీరంలో హార్మనల్ ఇన్ బాలన్స్ వలన వస్తాయి. అందులో ముఖ్యంగా థైరాయిడ్ గొంతు దగ్గర సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రంథి. ఈ వ్యాధి వచ్చిన వారు బరువుతగ్గాలి ,అలాగే మందులు వేసుకుంటే సరిపోతుందిలే అనుకుంటే పొరపాటే. దీనికి వ్యాయామంతో పాటు సరైన పోషకాహారం కూడా ముఖ్యమైనదే. థైరాయిడ్ హార్మోన్లు సరిగా పనిచేయకపోవడం వలన థైరాయిడ్ అనేది వస్తుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇది జీర్ణక్రియ రేటును అదుపులో ఉంచుతుంది. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవడం వలన మన జీవక్రియ అస్తవ్యస్తంగా మారి శరీరానికి తగిన శక్తి అందదు. థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను తక్కువ విడుదల చేస్తే దాన్ని థైరాయిజం అని అంటారు. ఇది ఎక్కువ కనిపిస్తున్న సమస్య. అలాగే థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా హార్మోన్లను విడుదలచేస్తే దాన్ని హైపర్ థైరాయిడ్ అంటారు. థైరాయిడ్ సమస్య స్త్రీల లో ఎక్కువగా కనిపిస్తుంది.
థైరాయిడ్ వలన త్వరగా అలసిపోవడం, నీరసంగా, అలసటగా ఫీలవడం, చలిగా అనిపించడం, జుట్టు రాలిపోవడం, ఆకలి తగ్గడం, చెమట పట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మందులతో పాటు మంచి ఆహారం, కొన్ని చిట్కాలతో థైరాయిడ్ ని అదుపులో ఉంచుకోవచ్చు. అందుకోసం ఒక కప్పు నీళ్ళలో రెండు స్పూన్ల ధనియాలు వేసి నీటిని మరిగించాలి. ధనియాలలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని అన్ని రకాల ఇన్ఫక్షన్లను తగ్గిస్తుంది. హర్మోన్లను నియంత్రించి థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తాయి. నీళ్ళు మరిగిన తర్వాత నీటిని వడకట్టి అందులో తేనెను కలిపి తాగవచ్చు.
ఇంకా రెండో చిట్కా అవిశెగింజలు తీసుకోవాలి. అవిశెగింజల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని దోరగా వేయించి పొడిచేయాలి. ఈ పొడిని ప్రతిరోజూ గోరువెచ్చగా ఉన్న నీటిలో కలిపి తాగవచ్చు లేదా పొడిని ఒక.స్పూన్ తినవచ్చు. ఈ రెండు చిట్కాలలో ఏదొకటి తీసుకోవడం వలన థైరాయిడ్ నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఉప్పు అధికంగా తీసుకునేవారు తగ్గించాలి. పచ్చికూరలు కూడా తగ్గించాలి. ఐరన్ ఎక్కువగా పదార్థాలు ఎక్కువగా తింటు కేరట్ బీట్రూట్ ఎక్కువగా తినడం మంచిది. ఇంట్లో నే ఉండే పదార్థాలతో ఈ చిట్కాలు పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. థైరాయిడ్ నుండి బయటపడొచ్చు.