స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ శాస్త్రవేత్తలు తక్కువ నిద్ర పోతున్న వారిని హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని, అనేక అనారోగ్య సమస్యలు వెంటాడతాయని వారు చెబుతున్నారు. అవసరమైనదానికంటే తక్కువ నిద్రపోయే వారికి ఎముకలలో ఖనిజ సాంద్రత(బీఎండీ) తగ్గి ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంది. ఎముకలు పెలుసుబారి విరిగిపోతాయని వైద్యుల పరిశోధనలో తెలిసింది.
అయితే శాస్త్రవేత్తలు మెనోపాజ్ వచ్చిన మహిళలపై అధ్యయనం చేసారు. రాత్రి ఏడు గంటలు నిద్రపోయేవారితో పోలిస్తే.. ఐదు గంటలే నిద్రపోయే స్త్రీలలో జీఎండీ తక్కువగా ఉందని గుర్తించారు. మరి దీనికి పరిష్కారం ఒక్కటే, సరైన సమయానికి నిద్రపోవడం.
- దీని ముందు ఖరీదైన ఫేషియల్ కానీ ఫేస్ ప్యాక్ కానీ పనిచేయదు
- రాత్రి పూట ఇలా చేస్తే వద్దన్నా మీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది
నిద్రలేమి వల్ల శరీరంపై వచ్చే అనేక దుష్ప్రభావాల గురుంచి తెలుసుకుందాం..
- నిద్రలేమి వల్ల హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలు.
- మనస్సు ప్రశాంతంగా లేకపోవడం, అనేక మానసిక సమస్యలు ఎదురవడం.
- నిద్రలేమితో మధుమేహం(డయాబెటిస్), రక్తపోటు(బీపి).
- వయసుతో సంబంధం లేకుండా గుండెజబ్బులు, గుండె సంబంధిత వ్యాధులు.
- నిద్రలేమితో మలబద్ధకం.
- నిద్రలేమి వల్ల ఆకలి అధికంగా పుట్టడం.. ఊబకాయం వంటి దీర్గకాలిక వ్యాధులు వస్తాయని నిపుణుల హెచ్చరిక.
- నిద్రలేమితో హింసాత్మక ఆలోచనలు కూడా పెరుగుతాయని అంటున్నారు.
- నిద్రలేమితో డిప్రెషన్ పాలవడం, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు అధికంగా ఉండటాన్ని పరిశోదనలో తేలింది.
- నిద్రలేమి వల్ల జలుబు ఎక్కువగా వస్తుందిట.
- నిద్రలేమి ప్రభావం మెదడు పనితీరుపై పడుతుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో …
అయితే నిద్రలేమి ఎవరిని పీడిస్తుంది?
- షిఫ్ట్ లో పనిచేసేవారికి నిద్రలేమి సమస్యలు తప్పవు.
- పిల్లల పెంపకం, ఉద్యోగాల వల్ల మహిళలు నిద్రలేమికి గురవుతున్నారు.
- కెఫిన్, మద్యం నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
- రాత్రివేళ్ళలో పార్టీలు, సామాజిక కార్యక్రమాల వంటివాటిలో అధికంగా యువత పాల్గొనడం.
- టీనేజర్ల నిద్రను తగ్గిస్తున్న స్మార్ట్ ఫోన్లు, విశ్రాంతి తీసుకోవాల్సిన బెడ్ రూమ్ లో లాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్ లు అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్’ల నుంచి వెలువడే నీలి రంగు వెలుతురు కళ్లపై పడి నిద్ర రాకుండా చేస్తుంది.
వేగంగా దూసుకెళ్తున్న నేటి తరంలో నిద్రకి విలువలేదు, శ్రద్ధ అంతకన్నా లేదు. తక్కువగా నిద్రపోవడంతో దాని ప్రభావం పెద్దల ఉద్యోగాలపై, పిల్లల చదువలపై తీవ్రంగా ఉంటుంది. ఇకనైనా అందరూ గ్రహించుకోవాలి.. మన శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ప్రముఖ పాత్ర పోషిస్తుందని.. దయచేసి నిద్రని గౌరవించండి.