సాధారణంగా చిన్న పిల్లలకు ఆహారం మొదలుపెట్టగానే ఎక్కువగా ఇడ్లీలో పంచదార వేసి నెయ్యి వేసి పెడుతుంటారు. ఇలా చాలా రోజులపాటు పెట్టడం వలన అది ఆరోగ్యమా కాదా అనేది కొంతమందికి అనుమానం. ఈ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం నూనెలో వేయించడం లేదు కనుక ఇది ఆరోగ్యకరమైన ఆహారం అని చిన్న పిల్లలకు త్వరగా అరగాలని ఇడ్లీ పెడుతుంటాం. అయితే ఇలా పెట్టడం వలన ఇడ్లీ పూర్తిగా కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటుంది. దానికి కారణం మినప్పప్పు, ఇడ్లీ రవ్వ అలాగే పంచదార కూడా. ఇవన్నీ తెల్లటి పదార్థాలు. వీటిని తెల్లటి విషం అని కూడా అంటుంటారు. మైదా మాత్రమే కాదు ఇవి కూడా అందులోకి వస్తాయి.
మామూలుగానే ఇడ్లీ ఎక్కువగా తీసుకోవడం వలన కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే శరీరానికి చేరుతాయి. మినప్పప్పులో గాని పంచదారలో గాని కార్బోహైడ్రేట్లు తప్ప ఇతర ఎటువంటి పోషకాలు ఉండవు. అలాగే పంచదారలో కేవలం తీపి తప్ప ఎటువంటి పోషకాలు ఉండవు. ఇలా ఇడ్లీని పంచదారలో ముంచి తినడం వలన శరీరంలో కార్బోహైడ్రేట్లు, షుగర్ లెవెల్స్ తప్ప ఎటువంటి పోషకాలు అందవు. ఒక ఇడ్లీలో 40-65 కేలరీల మధ్య ఉంటుంది మరియు అందువల్ల ఫైబర్ మరియు ప్రోటీన్ యొక్క ఎక్కువగా లభిస్తాయి. కానీ అధిక పరిమాణంలో అదే తీసుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే ప్రతికూలంగా మారుతుంది.
షుగర్‌ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని మనలో చాలా మందికి తెలుసు – అలా చేయడం వల్ల మీ రక్తపోటు తగ్గుతుంది, మీ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు మీకు చిత్తవైకల్యం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ మెదడు ఆరోగ్యంపై నిపుణులైన వైద్యుడి ప్రకారం, చక్కెర మన మెదడుపై ప్రయోజనకరమైన ప్రభావాలను చూపుతుంది. అలాగే నెయ్యిలో కొవ్వులు తప్ప ఎటువంటి పోషకాలు ఉండవు వీటికి బదులు రాగి జావా వంటి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలు పండ్లు, కూరగాయలు, ఉడికించి పెట్టవచ్చు అలాగే పండ్లరసాలు మెత్తగా ఉండే బొప్పాయి, సపోటా వంటి పండ్లను క్రమం తప్పకుండా పట్టడం వలన ఆరోగ్య కరమైన బరువు పెరుగుతారు.