How to relieve pain without Medicine

జీరో సైడ్ ఎఫెక్ట్స్ తో నాచురల్ పెయిన్ కిల్లర్……

కర్పూరం లో ముద్ద కర్పూరం వైద్య పరంగా చాలా బాగా ఉపయోగిస్తున్నారు. అది వెలిగించినప్పుడు వచ్చే వాసన పీల్చడం ద్వారా చాలా చాలా మంచిది. దీనిని పూజకు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ముద్ద కర్పూరం అనేది నొప్పులు తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది నొప్పిని తగ్గించడమే కాకుండా చర్మం లోపలికి వెళుతుంది అని సైంటిఫిక్ గా 2009లో చైనా అకాడమీ ఆఫ్ చైనీస్ మెడికల్ సైన్సెస్ బీజింగ్ చైనా వారు ఈ పరిశోధనను కెంఫర్ గురించి చేశారు. చర్మానికి కొన్ని గ్యాప్స్ ఉంటాయి. గ్యాపుల్ నుంచి కెంఫర్ లోపలికి వెళ్లిపోయి లోపల కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి లోపలకి వెళ్ళి మజిల్స్ ని స్మూత్ గా రిలాక్స్ చేస్తుంది.

అందుకని నొప్పులు ఉన్నచోట ఎక్కడైనా ముద్ద కర్పూరాన్ని కాస్త ఆవ నూనెలో వేస్తే కరిగిపోతుంది. దీనిని నొప్పి ఉన్నచోట పూస్తే కెంఫర్ లోపల చర్మం సందుల గుండా వెళ్లి నొప్పిని తగ్గిస్తుంది. నొప్పిని మోసు కెళ్ళడానికి నారల సెల్స్ ఉంటాయి. వీటినిరిసెప్టర్స్ శాంతింప చేస్తుంది. అలాగే జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. కొంతమందికి అప్పుడు కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి TNF ఆల్ఫా, IL 2, IL 6 ఇలాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ జాయింట్ లో ఇన్ఫ్లమేషన్ ని పెంచుతాయి. కెంఫర్ అనేది ఈ కెమికల్స్ ని అడ్డుకుంటుంది. అందుకని నొప్పులు జాయింట్స్ లో కూడా తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది అని నిరూపించారు.

అందుకని కండరాలు నొప్పులు ఉన్న, ఎక్కడైనా అలిసిపోయి పిక్కలు నొప్పిగా ఉన్న, మామూలుగా ఎక్కడైనా దెబ్బలు తగిలి నొప్పులు ఉన్న కానీ అట్లాగే జాయింట్ పెయిన్స్ ఉన్న,  ఎక్కడైనా ఇన్ఫ్లోమెజేషన్ ఉండి పెయిన్స్ ఎక్కడైనా వస్తున్న అలాంటి చోట ఉపశమనానికి కాస్త ఆవనూనె తీసుకుని దానికి ముద్ద కర్పూరం కలిపి కరిగిపోయిన తర్వాత దానిని పూసేస్తే లోపలికి వెళ్లి నాచురల్ పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది. ముద్దు కర్పూరాన్ని వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఎంతకాలం ఎన్ని రోజులు వాడినా నష్టం రాని విధంగా ఈ ముద్ద కర్పూరం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజుల్లో చిన్నదానికి కూడా పెయిన్ కిల్లర్స్ వాడేస్తున్నారు.

దానివల్ల పొట్టలో అల్సర్లు, ఎసిడిటీలు, కిడ్నీ సమస్యలు ఇలా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అందువల్ల నాచురల్ పద్ధతిలో ముద్ద కర్పూరాన్ని పెయిన్ కిల్లర్ గా వాడితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

Leave a Comment

error: Content is protected !!