how-to-remove-warts-skin-tags-pulipirlu-naturally

పులిపిర్లని ఇలా రాలగొట్టేద్దామా….

అందమైన మొహం ను చిరాకు పెట్టేలా మెడ భాగంలో పులిపిర్లు ఉంటే చాలా ఇబ్బంది కరంగా అనిపిస్తుంది.కేవలం మెడ మాత్రమే కాదు ముఖం, చేతులు, పాదాలు, నడుము ఇలా చాలా చోట్ల ఈ పులిపిర్లు వస్తుంటాయి. వీటివల్ల నొప్పి బాధ ఏమి లేకపోయినా చెప్పలేనంత చిరాకుని కలిగిస్తాయి.

అసలు పులిపిర్లు ఎందుకొస్తాయి??

శరీరంలో చెమట ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ప్రాంతాల్లో శుభ్రత లేకపోవడం వల్ల హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ ఉత్పత్తి అవుతుంది. ఈ వైరస్ వల్ల శరీరం మీద కణజాలం పెరుగుతూ పులిపిర్లుగా రూపాంతరం చెందుతాయి. ఇవి శరీరానికి ఏ విధమైన నొప్పిని కలిగించకపోయినా చూడటానికి కాసింత అసహ్యన్ని కలిగిస్తాయి. అలాంటి పులిపిర్లని మటుమాయం చేసే చిట్కాలు చూడండి మరి

◆ అవిశేగింజలు అందరికి తెలిసినవే ఇందులో ఉన్న పోషకాలు శరీరానికి ఎంత ఆరోగ్యాన్ని తెచ్చిపెడతాయో అలాగే పులిపిర్లని మాయం చేయడానికి అంతే బాగా పని చేస్తాయి. అవిశేగింజలను పేస్ట్ చేసి, కాసింత తేనె కలిపి పులిపిర్ల  మీద అప్లై చేసి దానిచుట్టు బ్యాండేజ్ కట్టాలి ఇలా కొద్దిరోజుల పాటు చేయడం వల్ల పులిపిర్లు రాలిపోతాయి.

◆ వంటింట్లో వెల్లుల్లి మహత్యం ఇప్పటికి ఎన్నో సమస్యలను నయం చేసుకోవడం ద్వారా తెల్సిపోయింది మనకు. ఇప్పుడు పులిపిర్లకు కూడా ఫటాఫట్ మెడిసిన్ గా పనిచేస్తుంది. వెల్లుల్లిని పేస్ట్ గా చేసి పులిపిర్ల మీద అప్లై చేసి బ్యాండేజ్ వేయాలి ఇది చక్కని ఫలితాన్ని ఇస్తుంది.

◆ఉల్లిపాయ వంటింట్లో తప్పనిసరిగా ఉంటుంది కదా కాసింత వెనిగర్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఆ వెనిగర్ ను పులిలిర్ల మీద రాయాలి ఇలా కొద్దిరోజులు చేస్తే పులిపిర్ల బాధ మాయం

◆ సాదారణంగా తలనొప్పి కోసం, ఒళ్లునొప్లుల కోసం కర్పూర తైలం వాడతారు. ఆ కర్పూర తైలాన్ని కొద్దిగా పులిపిర్ల మీద రాస్తుంటే పులిపిర్లు మాడిపోయి రాలిపోతాయి.

◆ రోజులో రెండు మూడు సార్లు ఆముదాన్ని పీపీర్ల మీద రాస్తుండలి పలితం తొందరగానే కనిపిస్తుంది

◆ కూరగాయలు కోసేటప్పుడు ఒక చిన్న ముక్క బంగాళాదుంపను తీసుకుని పులిపిర్ల మీద రుద్దాలి ఇలా కొన్ని రోజులు చేస్తే పులిపిర్లు మాయమవుతాయి.

◆ పైనాపిల్ ముక్కలను తీసుకుని పులిపిర్ల మీద రుద్దుతూ ఉన్నా లేక పైనాపిల్ రసాన్ని రాస్తున్నా పులిపిర్లు తగ్గుముఖం పడతాయి.

చివరగా….

పైన చెప్పుకున్న ఇన్ని చిట్కాలలో ఏదో ఒకటి చేసినా ఫలితం ఉంటుంది. అయితే చాలా మంది పలితం తొందరగా రావాలనే తొందరపాటుతో ఆరోగ్యకరమైన పద్ధతులు వదిలి పులిపిర్లను కత్తిరించడం, ఆగరువత్తి తో కాల్చడం లాంటివి చేస్తుంటారు ఇది సరైన పద్దతి కాదు ఏదైమైనా శాశ్వత పరిష్కారం కావాలంటే ఆరోగ్యమైన దారిలోనే వెళ్ళాలి మరి.

Leave a Comment

error: Content is protected !!