ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల వలన అందరికీ ముఖంపై సన్ టాన్, జిడ్డు, మురికి, నల్లటి వలయాలు, ముఖం పై నల్లని మచ్చలు, మొటిమల వలన వచ్చిన మచ్చలు, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించుకోవడం కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్తే వేలకు వేలు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రయోజనం ఏమీ ఉండట్లేదు. నేచురల్ చిట్కాలను ఉపయోగించినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ చిట్కా ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దీని కోసంమనం ముందుగా ఇంట్లో ఉపయోగించే బియ్యము తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బియ్యప్పిండిని పది రోజులకు మించి వాడకూడదు. పది రోజుల తర్వాత ఉపయోగించినట్లయితే దానిలో ఉండే పోషకాలు పోవడం వలన రిజల్ట్ అంతగా ఏమీ ఉండదు. ఒకసారి పట్టుకున్న పిండిని పది రోజులు మాత్రమే ఉపయోగించినట్లయితే మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఒక బౌల్ లో కొంచెం బియ్యప్పిండి ని తీసుకుని దానిలో పచ్చిపాలు వేసి ముఖానికి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా బాగా కలుపుకోవాలి.
తర్వాత దీనిలో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ వద్దు అనుకున్న వాళ్లు బాదం నూనె రెండు లేదా మూడు చుక్కలు వేసుకోవాలి. బాదం నూనె కూడా అందుబాటులో లేదు అనుకున్నవారు కొబ్బరినూనెను మూడు లేదా నాలుగు చుక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అన్ని బాగా కలిపి ముఖంపై అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత బాగా ఆరనివ్వాలి. తర్వాత చేతితో మృదువుగా ఐదు నుంచి పది నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి.
తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం పై ఉండే సన్ టాన్, జిడ్డు, మురికి, డెడ్ స్కిన్ సెల్స్ పోయి చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఎంత నల్లగా ఉన్న చర్మం అయినా సరే 10 నిమిషాల్లో తెల్లగా మెరిసిపోతుంది. ఈ ప్యాక్ ముఖంపై మాత్రమే కాకుండా శరీరంలో నల్లగా ఉన్న భాగంలో ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు. చంకలు, గజ్జలు, మెడ, కాళ్లు, చేతులు వంటి భాగాల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. బియ్యప్పిండి చర్మాన్ని తెల్లగా మెరిసిపోయేలా చేయడంలో ఉపయోగపడుతుంది. పాలు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ చర్మ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.