how to whiten teeth at home

2 నిమిషాల్లో ఎంతటి గారపట్టిన పసుపు పళ్ళు​ అయినా ముత్యాల్లా మెరిసిపోతాయి

ముఖసౌందర్యం విషయంలో పళ్ళవరసది ప్రత్యేక స్థానం. ముత్యాల్లాంటి పళ్ళు ఉండాలని ప్రతి ఒకరు కోరుకుంటారు. అది సహజమే. మనం నవ్వినప్పుడు, మాట్లాడినపుడు ముత్యాల్లాంటి పళ్ళవరస కనపడితే ముఖం అందంగా కనపడుతుంది. అలాగే ఎదుటివారు మాట్లాడటానికి ఇష్టపడతారు. కానీ ఈరోజుల్లో చాలామంది పళ్ళు తెల్లగా లేకుండా పసుపు రంగులో గారపట్టినట్టు ఉంటున్నాయి. 

దీనినుండి బయటపడాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా పాటించి చూడండి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మెత్తగా తురమాలి. లేదా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ప్లమేటరీ  లక్షణాలు దంతాలు తెల్లగా చేయడమే కాకుండా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. నోటి దుర్వాసన తగ్గిస్తాయి. 

కావిటీస్ తగ్గించడంలో కూడా కీలకంగా ఉంటాయి. వెల్లుల్లి మన వంటగదిలో అందరికీ అందుబాటులో ఉంటుంది. తర్వాత ఆ పేస్ట్ లో ఒక స్పూన్ టమాటారసం వేయాలి. టమాటాలో విటమిన్ సో అధికంగా ఉండడం వలన నోటిలోని బాక్టీరియాను తొలగిస్తుంది. పళ్ళపై ఉన్న గారను తొలగించి తెల్లగా మెరిసేటట్టు చేస్తుంది. తర్వాత ఇందులో మనం వాడే పేస్ట్ ఏదైనా వేయొచ్చు.

 బ్రష్ చేయడానికి వాడినంత వేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ నోటి దుర్వాసన తగ్గిస్తుంది. బాక్టీరియా నుండి పళ్ళ చిగుళ్లు , దంత సమస్యలు లేకుండా చేస్తుంది. ఈ మిశ్రమం దంతాల చిగుళ్ళను రక్షిస్తుంది. ఈ మిశ్రమం బాగా కలిసిపోయీంది కదా. బ్రష్ సాయంతో  పళ్ళమీద రుద్దాలి. ఐదునిమిషాలు పాటు వారం రోజుల పాటు చేస్తే పళ్ళు తెల్లగా అవడమే కాకుండా గార కూడా తొలగిపోతుంది. 

బాక్టీరియా నాశనమవడం వలన నోటిదుర్వాసన తగ్గి ప్రెష్గా ఉంటుంది. చిగుళ్ల వాపు, చిగుళ్లు నుండి రక్తంకారడం  సమస్యలు అన్నీ తొలగిపోతాయి. దీనివలన చిగుళ్లు దంతాలు ఆరోగ్యంగా, బలంగా తయారవుతాయి. నోటిదుర్వాసన తగ్గి జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. పంటి ఆరోగ్యం బాగూంటేనే శరీరంమొత్తం ఆరోగ్యం గా ఉంటుంది. ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పళ్ళపై పనిచేస్తుంది. 

Leave a Comment

error: Content is protected !!