ఐస్ క్యూబ్స్ మనం తీసుకునే డ్రింక్స్ ను చల్లబరచడానికి మాత్రమే ఉపయోగిస్తుంటాం, కానీ మీ చర్మ సంరక్షణ కోసం కూడా ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు. చర్మానికి ఐస్ క్యూబ్స్ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం అన్ని ఇళ్లలో తప్పక దర్శనమిచ్చే ఫ్రిజ్ ల వల్ల ఐస్ క్యూబ్స్ కు ఎలాంటి కొరత ఉండదు కూడా. మరింకేం అందరికి అందుబాటులో ఉండే ఐస్ క్యూబ్స్ తో కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు చూసి అనుసరించండి.
ఎండ వల్ల కమిలిన చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది
అందుబాటులో ఉన్న కలబంద లేదా కీరా దోసను గ్రైండ్ చేసి జ్యుస్ తయారుచేసుకోవాలి. ఈ జ్యుస్ ను ఐస్ క్యూబ్స్ ట్రే లో వేసి డీప్ ఫ్రిజ్ లో ఉంచాలి. వీటిని ఎపుడూ స్టాక్ ఉంచుకోవచ్చు.ఎండవల్ల కమిలిన చర్మానికి ఈ ఐస్ క్యూబ్స్ ను మెల్లిగా అప్లై చేస్తూ ఉండటం వల్ల చాలా గొప్ప ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు కలబంద మరియు కీర దోస లోని గుణాలు చర్మాన్ని ఆరోగ్యవంతంగా మరియు తేమగా ఉంచడంలో దోహాధం చేస్తాయి. సులువుగా చేసుకోదగ్గ గొప్ప గృహ చిట్కా ఇది.
ఉబ్బిన కళ్ళను సేదతీర్చడానికి
కొందరి కళ్ళు ఉబ్బిపోయి ఉంటాయి. దీనికి కారణాలు ఏవైనా కావచ్చు కానీ కళ్ళ చుట్టూ చర్మం ఉబ్బెత్తుగా మారిపోయి ఉంటుంది. దీన్ని వదిలించుకోవడానికి ఐస్ క్యూబ్స్ మంచి పరిష్కారం. సాధారణ ఐస్ క్యూబ్స్ వల్ల ఉపశమనం లభించినా చర్మ సంరక్షణ కోసం కోల్డ్ ప్యాక్ ను ఉపయోగించడం ఉత్తమం. దీనికోసం గ్రీన్ టీ మరియు పాలను ఉపయోగించి ఐస్ క్యూబ్ ప్యాక్ తయారు చేయవచ్చు. కొంచెం గ్రీన్ టీ తయారు చేసి, మిశ్రమాన్ని ఐస్ ట్రేలో భద్రపరుచుకోండి, అవసరమైనప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు వీటివల్ల. తరువాత క్లీన్ టవల్ తో శుభ్రజం చేసుకోవాలి. చర్మం ఆరోగ్యవంతంగా అవుతుంది.
మంట & మొటిమలను తగ్గిస్తుంది
ఐస్ క్యూబ్స్ మొటిమల సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఐస్ క్యూబ్స్ మొటిమల రంధ్రాలను కుదించడంలో సహాయపడుతుంది, తద్వారా మొటిమలను కొంతవరకు తగ్గిస్తుంది. వాపు మరియు దాని ఫలితంగా వచ్చే ఎరుపును శాంతపరచడంలో ఇవి సహాయపడతాయి. మీరు మీ ముఖంపై ఐస్ క్యూబ్స్ అప్లై చేసే ముందు మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఐస్ క్యూబ్స్ ను అప్లై చేయడం వల్ల చర్మం మీద మురికి, వాటి వల్ల ఏర్పడిన మొటిమలు, వాటి తాలూకు మంట మొదలైనవి తగ్గిస్తుంది.
చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది
చర్మం గూర్చి సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల యవ్వనంగా ఉంచుకోవచ్చు. బయటి రసాయన ఉత్పత్తులు వాడే కంటే ఇంటి చిట్కాలు పాటించడం చాలా ఉత్తమం. వాటిలో ఐస్ క్యూబ్స్ అత్యంత ప్రభావవంతమైనవి. ఐస్ క్యూబ్స్ మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి మరియు మృదువుగా ఉండటానికి సహాయపడతాయి.శుభ్రం చేసుకున్న ముఖం పై ఐస్ క్యూబ్స్ తో వృత్తాకారంగా మెల్లిగా మసాజ్ చేయడం వల్ల ఆశించిన అపలితం చూడవచ్చు.
కాంతివంతమైన చర్మం కోసం
జిడ్డుగల చర్మం గలవారికి, చర్మంలో కళ పోయి నిస్తేజంగా ఉన్నవారికి ఐస్ క్యూబ్స్ గొప్పగా పనిచేస్తాయి. ఐస్ క్యూబ్స్ చర్మం నుండి నూనెలు మరియు కొవ్వులను తగ్గించడంలో సహాయపడుతుంది, చర్మాన్ని తాజాగా మార్చడంలో దోహాధం చేస్తుంది. ముఖం మీద ఐస్ క్యూబ్స్ ను మెల్లిగా మసాజ్ చేస్తూ ఉండాలి తరువాత పొడి టవల్ తో ముఖాన్ని శుభ్రం చేసుకుని మశ్చరైజింగ్ క్రీమ్ ను అప్లై చేయాలి. దీనివల్ల ముఖం తాజాగా ఉంటుంది.
చివరగా…
మనకు అందుబాటులో ఉండే క్యారెట్, కలబంద, పుదీనా, కీర ఇంకా మరెన్నిటినుండో జ్యుస్ తయారు చేసి ఐస్ క్యూబ్స్ గా వాడితే ముఖారవిందం సొంతమవుతుంది.