మనుషులకు అతి పెద్ద సమస్య రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం. శరీరాన్ని కబళించే జబ్బులను ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తి ముఖ్యం. ఆహారం ద్వారా దీన్ని పెంచుకోవడం ఎంతో ఉత్తమం మరి అలాంటి గొప్ప ఆహారాలు ఏమిటో చూడండి.
వెల్లుల్లి
ఇది శక్తివంతమైన యాంటీ వైరల్. దీన్ని పచ్చిగా తినవచ్చు లేదా సూప్‌లలో చేర్చవచ్చు. తరిగిన పచ్చి వెల్లుల్లిని ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలపాలి దీన్ని తీసుకోవడం వల్ల గొప్ప యాంటీ వైరల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అలాగే ప్రతిరోజూ లవంగాన్ని బుగ్గన పెట్టుకోవడం లేదా నమిలి తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతమైన మార్గాలుగా పనిచేస్తాయి.
జాజి పువ్వు
పువ్వు ఆకారంలో ఉండే మసాలా దినుసులలో షికిమిక్ ఆమ్లం ఉంటుంది, దీనిని టామిఫ్లు ఉత్పత్తికి మూల పదార్థంగా ఉపయోగిస్తారు, దీనిని ఇన్ఫ్లుఎంజా వైరస్ కోసం ఉపయోగిస్తారు. ఇది యాంటీ వైరల్ గా సూపర్ పవర్ఫుల్. జాజీపువ్వు తీసుకొని నీటిలో ఉడకబెట్టి గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ వంటి వాటిలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అల్లం
మెత్తని అల్లం మరియు జాజీపువ్వు ను బాగా ఉడికించాలి. తరువాత వడగట్టి అందులో కాసింత తేనెను కలిపి తీసుకోవడం ద్వారా మంచి రోగనిరోధక శక్తిని సొంతమవుతుంది.
కొబ్బరి నూనే
ఆహారాన్ని వండేటప్పుడు ఇతర నూనెలు వదిలి స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో వండటం ఉత్తమం. కొబ్బరి నూనెను నేరుగా కూడా తీసుకోవచ్చు. ఒక స్పూన్ కొబ్బరి నూనెను ప్రతిరోజు తీసుకోవడం వల్ల వైరల్స్కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన లారిక్ ఆమ్లం మరియు కాప్రిలిక్ ఆమ్లం కొబ్బరి నూనెలో లభ్యమవుతుంది.
రెస్వెరాట్రాల్
శనగపప్పు, పిస్తా, ద్రాక్ష, ఎరుపు, తెలుపు వైన్, బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్, స్ట్రాబెర్రీ, మరియు కోకో మరియు డార్క్ చాక్లెట్ వంటి రెస్వెరాట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు ఫంగల్ ఇన్ఫెక్షన్, అతినీల లోహిత కిరణాల నుండి రక్షణ, ఒత్తిడి మరియు గాయాలతో పోరాడటానికి సహాయపడతాయి.
విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాలు
విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాలైన ఉసిరి, ఎర్ర మిరియాలు, పసుపు మిరియాలు, విటమిన్ సి సప్లిమెంట్స్ అయిన నిమ్మ, బత్తాయి, స్టాబెర్రీ వంటి పుల్లటి పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి.
యాంటీ వైరల్ మూలికలు
రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుర్వేద మూలికలు సహాయపడతాయి
వాము, తులసి, ఎండిన థైమ్ వంటి యాంటీ-వైరల్ మూలికలు రోగనిరోధక శక్తికి గొప్పవి, మరియు శ్లేష్మ ఆరోగ్యానికి టీ లేదా కూరలలో శ్లేష్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉపయోగించవచ్చు, ఇవి బ్యాక్టీరియా మరియు వ్యాధికారక క్రిములను నిర్మూలించడంలో సహాయపడతాయి. అల్లం, వెల్లుల్లితో పాటు ఒక టేబుల్ స్పూన్ థైమ్, వాము ఆకు కలిపి టీ చేసుకోవచ్చు.
థైమ్, వాము యూకలిప్టస్ (నీలగిరి) లేదా జాజి పువ్వు వంటి ముఖ్యమైన నూనెలను అప్పుడప్పుడు పీల్చడం వల్ల స్వశ ఎంగా ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఇతర నిత్యావసరాలు
విటమిన్ డి స్థాయిలను పెంచుకోవాలి ఎందుకంటే తక్కువ స్థాయిలో విటమిన్ డి ఉంటే తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నట్టు.
తెల్ల చక్కెర నుండి దూరంగా ఉండటం చాలా ముఖ్యం.
జింక్, సెలీనియం వంటి ఖనిజాలను చేర్చాలి. వీటిని బాదం, గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, ఉప్పు లేని జీడిపప్పు మరియు ఉప్పు లేని పిస్తాపప్పులలో పొందవచ్చు
చివరగా……..
ఈ ఆహారాలు రోజులో భాగం చేసుకోవడం తో పాటు, తగిన నిద్ర, వ్యాయామం, రోజువారీ నడక వంటివి తప్పనిసరిగా పాటించాలి.