శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు పూజలు పునస్కారాలు అంటే చాలా బిజీ బిజీగా ఉంటారు. పూజలు చేసినప్పటికీ శ్రావణమాసములో శుక్రవారం వచ్చేసరికి లక్ష్మీదేవికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. పూజలు చేయడమే కాకుండా లక్ష్మీదేవికి ఇష్టమైన పూలు ఫలహారాలను పెడుతూ ఉంటారు. అలాగే శ్రావణమాసం రెండో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తూ ఉంటారు. వరలక్ష్మీ వ్రతం చేసే వారందరూ వ్రతం రోజున స్నానం చేసే నీటిలో ఇది కలిపి స్నానం చేసినట్లయితే జన్మజన్మల పాపం పోతుంది.
వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారు ఝామునే లేచి తలస్నానం చేసి లక్ష్మీ దేవికి పూజలు చేస్తూ ఉంటారు. వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారికి బంగారం లేదా డబ్బులను పెట్టి పూజ చేయడం వలన అది రెట్టింపు అవుతుందని మన నమ్మకం. పూర్వం రోజుల్లో కూడా వరలక్ష్మీ వ్రతం చేసిన ప్రతిసారి మన పూర్వీకులు లక్ష్మీ రూపుని మెడలో వేసుకునే వారు. వారు ప్రతి సంవత్సరం కొన్న రూపులు అన్ని మేడలో వేసుకునే వారు. లక్ష్మి రూపులను చూస్తే వారు ఎన్ని సంవత్సరాల నుండి వ్రతం చేస్తున్నారో సులభంగా అర్ధమయ్యేది.
వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుఝామునే లేచి మన స్నానం చేసే నీళ్ల బకెట్లో కొంచెం పసుపు వేసి పసుపు బాగా కలిపి ఆ నీటితో తలస్నానం చేసినట్లయితే మన జన్మ జన్మల పాపాలు పోతాయి. స్నానం అయిన తర్వాత కాళ్ళకి, మొహానికి పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని, చేతి గాజులు వేసుకుని అమ్మవారిలా తయారయి పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం పొందుతాము. వరలక్ష్మీ వ్రతం చేసుకున్న ప్రతి ఒక్కరు మర్చిపోకుండా స్నానం చేసే నీళ్ళలో కొంచెం పసుపు కలుపుకుని స్నానం చేయడం వలన లక్ష్మీ కటాక్షం పొందిన వాళ్లు అవుతారు.
వరలక్ష్మీ వ్రతం చేయడం వల్ల కొన్ని సంవత్సరాల నుండి ఉన్న కష్టాలు కూడా పోతాయి. వరలక్ష్మీ వ్రతం రోజున బంగారం పెట్టడం వలన రెట్టింపు అవడమే కాకుండా సిరి, సంపదలు కలుగుతాయని నమ్మకం. చెయ్యాల్సింది తలారా స్నానం కాబట్టి పసుపు కలిపి తలపై నుంచి వేసుకోవడం వలన సకల పాపాలు పోతాయి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున మీరు కూడా స్నానం చేసే నీటిలో కలుపుకుని తలారా స్నానం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.