Increases Nerve Strength Reduces Paralysis Blood Thinning

నర నరాల్లో బలం పెరిగి పక్షవాతం అస్సలు రాదు……. మీ ఇంట్లో ఉన్న దీన్ని వాడటం మానేయండి…… రక్తం పలుచగా అవుతుంది……

 ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారం అలవాట్లు వలన చాలామందికి చిన్న వయసులోనే పక్షవాతం వంటివి వస్తున్నాయి. ఒకసారి పక్షవాతం వచ్చింది అంటే వారి పని వారు చేసుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోతారు. కొంతమందికి ఇది కొన్ని నెలల్లోనే తగ్గుతుంది. కానీ చాలామందికి ఇది జీవితాంతం ఇబ్బంది పెడుతూ వస్తుంది. దీనివల్ల వీరు మానసికంగా కూడా కృంగిపోతారు. వీరు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ వ్యాయామాలు మరియు ఫిజియోథెరపీ ద్వారా ఉపశమనం పొందడానికి ప్రయత్నిస్తారు. మరియు మందులు వాడుతూ ఉంటారు.

                     కానీ వీరికి అంత త్వరగా ఉపశమనం లభించడం లేదు. దీనికి కారణం ఎన్ని వ్యాయామాలు చేసిన, ఫిజియోథెరపీ చేయించుకున్న వారి ఆహారంలో మాత్రం ఎటువంటి మార్పు చేయరు. దీని ద్వారా వారికి తగిన ఫలితం లభించడం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా కాలు చేయ్యి వారి స్వాధీనంలోకి రావడానికి, వారి మరల సాధారణంగా పనిచేసుకునే స్థితిలోకి రావాలి అంటే ఆహార నియమాలు మొదటిగా పాటించాలి. ఆహార నియమాలు మంచివి కాకపోవడం వలన మనకు పక్షవాతం అనేది వస్తుంది. రక్తం గడ్డ కట్టి రక్తనాళాల్లో అడ్డుపడడం వలన ఈ పక్షవాతం వస్తుంది.

                       పక్షవాతం వచ్చిన తర్వాత అందరూ అన్ని మార్చుకుంటారు కానీ ఆహారపు అలవాట్లు మాత్రం మార్చుకోరు. వీరికి చెయ్యి, కాలు అదుపులోకి రావాలి అంటే ఉడికించిన ఆహారం మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే పెట్టాలి. దీనితో పాటు ఒక ఆకు కూర రోజు ఉండాలి. ఎందుకు అంటే రక్తం పల్చబడడానికి బాగా మూవ్ అవడానికి ఆకుకూరలు బాగా హెల్ప్ చేస్తాయి. ఇవి అసలు ఉప్పు వేయకుండా చాలా పద్ధతిగా పెట్టాలి. వీటితోపాటు ఏదో ఒక కూరగాయ కూర ఉప్పు లేకుండా వండి పెట్టాలి. ఉప్పు గనుక ఒక నాలుగు ఐదు నెలలు మానిపిస్తే మీరు ఆశించిన ఫలితం త్వరగా లభిస్తుంది.

                         శరీరానికి కావలసిన పోషకాలు మంచిగా అందడం కోసం ఉదయాన్నే కాస్త వెజిటేబుల్ జ్యూస్ తాగాలి. ఇది తాగిన గంట తర్వాత అల్పాహారంలో ఫ్రూట్స్ తినాలి. ఇలా రెండు మూడు నెలలు చేసిన తర్వాత మొలకెత్తిన గింజలు కూడా కలుపుకోవచ్చు. ఉదయం, సాయంత్రం జ్యూస్ లు ఇవ్వాలి. మూడు పూటలా ఈ డైట్ పెడుతూ ఫిజియోథెరపీ, వ్యాయామాలు చేయించడం ద్వారా వారు త్వరగా కోలుకుంటారు….

Leave a Comment

error: Content is protected !!