Is back pain common after anesthesia

డెలివరీ టైంలో వెన్నుకు ఇచ్చి మత్తు ఇంజక్షన్ వల్ల వెన్ను నొప్పి వస్తుందా

సిజేరియన్ డెలివరీ సమయంలో వెన్నుకు మత్తు ఇవ్వడం ప్రసవం తర్వాత వారాలు మరియు నెలల్లో వెన్నునొప్పి చాలా సాధారణ ఫిర్యాదు.  వాస్తవానికి, దాదాపు సగం మంది కొత్త తల్లులు 6 నెలల ప్రసవానంతర సమయంలో వెన్నునొప్పి ఉంటుందని చెప్పారు.  వెన్నునొప్పికి చికిత్స చేయవచ్చు, అయితే నొప్పికి కారణాన్ని తగ్గించడం మొదటి దశ. . ముఖ్యంగా వెన్నుకు మత్తు  ఇవ్వడం వలన వెన్ను నొప్పి రావడం జరగదు. దానికి కొన్ని పనులు ముఖ్య కారణాలుగా ఉంటాయి. అవి డెలివరీ తర్వాత మనం పాలిచ్చేటప్పుడు మన శరీరంలోని క్యాల్షియం తగ్గిపోతుంది. ఇది ఎముకలు, వెన్ను నొప్పికి కారణం అవుతుంది. 

అందుకే ప్రసవానంతరం తప్పకుండా కాల్షియం, మల్టీ విటమిన్ సప్లిమెంట్లు వాడటం చాలా అవసరం. డాక్టర్ సలహాతో ఈ టాబ్లెట్ లు తీసుకోవడం వలన వెన్నునొప్పి ఇలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు సరైన పొజిషన్లో కూర్చోకపోవడం లేదా అధికంగా పనిచేయడం, ఎక్కువగా కూర్చోవడం లేదా నిల్చొని ఉండడం, వంగడం కూడా ఈ సమస్యకు కారణం అవుతుంది. పాలిచ్చేటప్పుడు చాలామంది ముందుకు వంగిపోతూ ఉంటారు. ఇలా ముందుకు వంగడం నడుముకు సరైన విశ్రాంతి తీసుకోకపోవడం, నడుం నొప్పికి కారణం. పాలిచ్చేటప్పుడు వెనక ఏదైనా సపోర్ట్ తీసుకోవాలి. గోడకు ఆనుకొని కూర్చోవడం బిడ్డ కింద తలగడలు లేదా ఫీడింగ్ పిల్లోస్ వాడటం చేయాలి. ఇలా చేయడం వల్ల వెన్ను సరైన స్ట్రక్చర్ లో ఉంటుంది.

 అలాగే కొంతసేపు ఎండలో కూర్చుని ఉండడం  వలన విటమిన్ డి లభిస్తుంది. ఇది మన ఆహారం ద్వారా తీసుకున్న కాల్షియంను శరీరం గ్రహించేలా చేస్తుంది. కనీసం మూడు నెలలు దాటిన తర్వాత తేలికపాటి వ్యాయామం చేయడం వలన ఈ సమస్యలను రాకుండా తగ్గించుకోవచ్చు. ఆహారంలో పాలు, చీజ్, రాగులు, బాదం, నువ్వులు, బెల్లం వంటి క్యాల్షియం అధికంగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడు కూడా సమస్య ఎక్కువగా ఉంటే డాక్టర్ను కలవడం చాలా అవసరం.

Leave a Comment

error: Content is protected !!