is it safe to use non stick cookware

నాన్ స్టిక్ పాత్రలలో విస్మయపరిచే నిజాలు.

వంటింట్లో అందంగా కనిపించే పాత్రల్లో ఎక్కువ శాతం నాన్ స్టిక్ సామాను ఉంటుంది. నూనె ఎక్కువ పీల్చవు అనే ఆరోగ్య స్పృహతో అందరూ దోసెలు వేయడం నుండి కూరలు చేయడం వరకు అన్నిటికి నాన్ స్టిక్ సామానే వాడుతారు. అయితే ఈ నాన్ స్టిక్ కూడా మేడి పండు చందాన పైకి అందంగా ఉన్నా అందులో ఎంతో హానికరం దాగుందని విశ్లేషకుల అభిప్రాయం. మరి ఆ హానికరం ఏంటి అసలు నాన్ స్టిక్ వల్ల ప్రమాదమా?? ఆరోగ్యమా?? నమ్మలేని నిజాలు మీరే చూడండి.

◆కొత్తగా నాన్ స్టిక్ పాన్ ఏదైనా కొన్నామంటే మొదటిసారి ఉపయోగించేటపుడు స్టవ్ మీద పెట్టి వేడి చేయగానే ఒకవిధంగా కాలిన వాసన వస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే ఏ ఫ్యాక్టరీ నుండి వెలువడిన ప్లాస్టిక్ మరియు కర్బన సమ్మేళనాలు మండిన వాసన పోలి ఉంటుంది. పెర్ఫ్లోరోక్టానిక్ యాసిడ్ అనే వాయువు విడుదల అవడం వల్ల అటువంటి వాసన సంభవిస్తుంది.

◆ఈ  పెర్ఫ్లోరోక్టానిక్ యాసిడ్ ప్లోరైడ్ తో కలిపి జరిపే చర్య వల్ల శరీరానికి హాని కలిగించే విష వాయువులు విడుదల అవుతాయి. ఈ ప్రక్రియలో వండిన ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల గొంతుకు ఇరువైపులా వుండే థైరాయిడ్ గ్రంధి పనితీరు అస్తవ్యస్తం అవుతుంది. ప్లోరైడ్ చూపే ప్రభావం ఫలితంగా థైరాయిడ్ గ్రంధి విడుదల చేసే హార్మోన్లు వేగవంతమై అది హైపోథైరాయిడ్ సమస్యకు కారణం అవుతుంది.

is it safe to use non stick cookware
Nonstick Teflon Coasted Pan

◆నూనెలు ఎక్కువ పీల్చని ఆహార పదార్థాల పేరుతో నాన్ స్టిక్ లో వండిన పదార్థాలు తినడం వల్ల మెదడు బలహీన పడి మతిమరుపు వంటి  మెదడుకు సంబందించిన సమస్యలు వస్తాయి

◆నాన్ స్టిక్ లో వండే పదార్థాలలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇవి పెరిగిపోవడం వల్ల గుండేకు మంచి చేసే కొవ్వులు కలుషితం అయిపోయి గుండెపోటుకు దారితీస్తాయి.

◆నాన్ స్టిక్ పాత్రల్లో వంటలు ఆరోగ్యమని పిచ్చి నమ్మకంలో ఆహారాన్ని వండుకుని తినడం వల్ల గర్భిణి స్త్రీలలో సమస్యలు ఎదురవుతాయి. ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటివి వండేటపుడే నిర్వీర్యం అయిపోవడం వల్ల కడుపులో బిడ్డకు కావలసిన పోషకాల సరఫరా జరగక పిల్లలు బలహీనతతో పుట్టడం, అవయవాల లోపం లాంటివి సంభవిస్తాయి.

◆నూనె తక్కువ ఉంటూ ఎక్కువసేపు బాగా ఫ్రై అవ్వడం వల్ల ఆహారపదార్థాలలో విటమిన్ సి నశించిపోతుంది. అందువల్ల నాన్ స్టిక్ లో వండే ఆహారం వల్ల రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి లభించక జబ్బులకు తొందరగా మన శరీరం లొంగిపోతుంది.

◆శరీరంలో ముఖ్యమైన కాలేయం మరియు దాని పనితీరు మందగించి అది ప్రమాదకరమైన పరిణామానికి దారి తీసే అవకాశం ఉంటుంది.

◆తక్కువ నూనె, వేగుతున్న పదార్థాల్లో తేమ మొత్తం ఇగిరిపోవడం వల్ల మనం తీసుకునే ఆహారంలో విషపూరిత వాయువుల సమ్మేళనాళతో నిండిపోయి ఉంటుంది. ఆ ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన మూత్రపిండ వ్యవస్థ దెబ్బతిని కిడ్నీ లు ఫెయిల్ అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది.

చివరగా…….

ఒకప్పుడు మన పెద్దలు ఇనుప పాత్రలు వాడి ఎంతో ఆరోగ్యంగా జీవించిన రోజులు మనం చూసి ఉన్నాం. అలాంటపుడు పెద్దల పద్దతిలో ఇనుప పాత్రలు ఉపయోగించి ఆరోగ్యంగా ఉండటమే మన జీవితకాలాన్ని పొడిగిస్తుందనే విషయం అందరూ తెలుసుకుని నాన్ స్టిక్ కు దూరం గా ఉండటమే ఉత్తమం.

 కాదంటారా??  మీరే నిర్ణయించుకోండి.

Leave a Comment

error: Content is protected !!