కొంతమందికి రోజూ ముక్కలేనిదే ముద్దదిగదు. కానీ రోజూ అలా తినడం లాభమా నష్టమా. తింటే ఏం జరుగుతుందో నిపుణులు అంటున్నారో చూద్దాం రండి. రోజూ చికెన్, మటన్, సీఫుడ్ తినడం మంచిది కాదు అంటున్నారు.ఎందుకంటే అతి ఎప్పుడూ ప్రమాదమే. చిన్నపిల్లలు ఎక్కువగా మాంసాహారం తింటే వారి ఎదుగుదలలో లోపాలు ఏర్పడతాయి. అలా తినడంవలన చిన్నవయసులోనే వృద్ధాప్య లక్షణాలు వస్తాయి. అలాగే మాంసాహారం రోజూ తినడంవలన మూత్రపిండాల్లో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రోజూ తినడంవలన కాలేయసమస్యలు, కాన్సర్ వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి..
అలాగనీ పూర్తిగా మాంసాహారం మానేయాల్సిన పనిలేదు. మితంగా తీసుకోవాలి. మాంసాహారం లో కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలు తినాలి. మటన్‌లో ఎక్కువగా కొవ్వు పదార్థాలు ఉంటాయి. చికెన్, రొయ్యలు,చేపలలో ప్రొటిన్ శాతం ఎక్కువ. కొవ్వు ఎక్కువగా ఉండే మాంసాహారం మటన్, రెడ్‌మీట్ ఎక్కువగా తింటే ldk అంటే చెడుకొలెస్ర్టాల్ , ట్రై గ్లిజరైన్స్ చేరతాయి. దీనివలన గుండెసంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే కొవ్వు పదార్థాలు తగ్గించాలి. ప్రొటిన్ ఉండే పదార్థాలు రోజూ తినొచ్చు కినీ మితంగా తినాలి. ప్రొటీన్లు కణజాలాన్ని అభివృద్ధి చేసి కండరాలు ధృడంగా చేస్తాయి. అంటే రోజుకు యాభై నుండి వందగ్రాముల చేపలు లేదా చికెన్‌ని తినవచ్చు. మటన్ ని వారానికి ఒకసారి మాత్రమే తినడం మంచిది.
కిడ్నీ సమస్యలు, గుండె వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహాతో తీసుకోవడం మంచిది. లేకపోతే సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా పూర్తిగా ఉడికిన మాంసం తినాలి. మాంసాహారం విషయంలో గర్బవతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా ఉడకని మాంసం వలన టోక్యో ప్లాస్మోసిస్ అనే ఇన్ఫెక్షన్ వచ్చి గర్బస్థ శిశువు మెదడు సరిగ్గా ఎదగదు అని నిరూపితమైందని అనేక పరిశోధనలు తెలిపాయి. అంథత్వం కూడా వచ్చే అవకాశం వచ్చింది. సరిగా ఉడకని మాంసం వలన పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. అందుకే మాంసం తినే విషయంలో జాగ్రత్తలు వహించాలి. శరీరం మన మాట వినదు కనుక శరీరం చూపించే సూచనలను బట్టి అవసరమైన మేర తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం